Redmi Smart Fire TV 32: రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 32 అంగుళాల మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్ ఫైర్ టీవీ స్ట్రీమింగ్ డివైస్‌ల్లో అందించే ఫైర్ టీవీ సాఫ్ట్ వేర్ ప్యాకేజ్ ఈ టీవీలో అందించారు. అమెజాన్, అలెక్సా స్ట్రీమింగ్ స్మార్ట్ హోం ఎకో సిస్టం ఉన్న చవకైన టీవీ ఇదే.


రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 ధర
ఈ టీవీ ధరను మనదేశంలో రూ.13,999గా నిర్ణయించారు. 32 అంగుళాల వేరియంట్‌లో మాత్రమే ఈ టీవీ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇది కేవలం ఒక్క సైజులో మాత్రమే అందుబాటులో ఉంది. 32 అంగుళాలతో వచ్చిన ఈ టీవీలో హెచ్‌డీ రిజల్యూషన్ డిస్‌ప్లేను అందించారు. ఫైర్ ఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పని చేయనుంది. ఇతర బ్రాండ్ల ఫైర్ టీవీ డివైస్‌ల్లో ఉండే ఫీచర్లే ఇందులో కూడా ఉన్నాయి. రెండో తరం ఫైర్ టీవీ క్యూబ్‌లో కూడా దాదాపు ఇవే ఫీచర్లు అందించారు.


పాపులర్ స్మార్ట్ టీవీ యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసులను ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, యాపిల్ టీవీ వంటి యాప్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్‌లకు కూడా ఇందులో సపోర్ట్ ఉంది. ఈ టీవీలో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉన్న 20W స్పీకర్‌ను అందించారు.


బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్‌ప్లే, మిరాకాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, 3.5 ఎంఎం సాకెట్, స్పీకర్ కనెక్టివిటీ, ఎథర్‌నెట్ పోర్టు వంటి ఫీచర్లు అందించారు. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఈ టీవీలో ఉన్నాయి.


ఇందులో కొత్త రిమోట్‌ను అందించారు. దీన్ని ఫైర్ టీవీ ఇంటర్‌ఫేస్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. రిమోట్‌లో అలెక్సా కోసం ప్రత్యేకమైన బటన్ కూడా అందించారు. ఇది రెడ్‌మీ ఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయనుంది. 


రెడ్‌మీ నోట్ 12 టర్బో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 2 ప్రాసెసర్ అందుబాటులో ఉంది. ఫోన్ వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,900) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగానూ (సుమారు రూ.26,300), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,399 యువాన్లుగానూ (సుమారు రూ.28,700) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,799 యువాన్లుగా (సుమారు రూ.33,400) ఉంది.


క్సిన్‌గాయ్ బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన హ్యారీ పోటర్ వెర్షన్ కూడా విడుదల అయింది.