రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో నవంబర్ 30వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని అమెజాన్ అధికారికంగా ధ్రువీకరించింది. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను రీబ్రాండ్ చేసి ఈ పేరుతో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను అమెజాన్ అధికారికంగా టీజ్ చేసింది. దీన్ని బట్టి రెడ్‌మీ నోట్ 11టీ 5జీ లాంచ్ అయ్యాక అమెజాన్‌లో అందుబాటులో ఉండనుందని అనుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను ఇందులో రివీల్ చేయలేదు. అమెజాన్‌తో పాటు ఎంఐ.కాం, ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.20 వేలలోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించనున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు.
5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ ఇందులో ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
ఇటీవలే రెడ్‌మీ తన బడ్జెట్ ఫోన్ల ధరలను కూడా పెంచింది. రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ల ధర రూ.300 మేర పెరిగింది.
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: రూ.10 వేలలోనే ఒప్పో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!