Redmi New Phones: రెడ్‌మీ (Redmi) మనదేశంలో తన సూపర్ హిట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ ఫోన్లు వచ్చే నెలలో మనదేశంలో లాంచ్ కానున్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro), రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ (Redmi Note 11 Pro+) స్మార్ట్ ఫోన్లు మార్చి 9వ తేదీన మనదేశ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి.


రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు గ్లోబల్‌గా లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ మనదేశంలో కూడా లాంచ్ కానున్నాయి. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్లను రెడ్‌మీ మనదేశంలో లాంచ్ చేయనుంది.


రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ స్పెసిఫికేషన్లు (Redmi Note 11 Pro Series Specifications)
ఈ రెండు ఫోన్లలోనూ 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. వీటి రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. టచ్ శాంప్లింగ్ రేట్ మాత్రం ఏకంగా 360 హెర్ట్జ్‌గా ఉండనుందని తెలుస్తోంది. ముందువైపు హోల్ పంచ్ తరహా డిజైన్ అందించనున్నారు. రెడ్‌మీ నోట్ 11 ప్రోలో మీడియాటెక్ హీలియో జీ96, రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్లు ఉండనున్నాయని సమాచారం.


రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా (108MP Camera) ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది.ఈ ఫోన్ల ధర మనదేశంలో ఎంత ఉండనుందో తెలియరాలేదు. అయితే ఈ స్పెసిఫికేషన్లను బట్టి రూ.20 వేలలోపు నుంచే వీటి ధర ప్రా మాత్రం అంచనా వేయవచ్చు.