ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10 5G)పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే యూరప్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 10టీ 5 జీ, పోకో ఎం 3 ప్రో 5 జీ ఫోన్ల రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మి నోట్ 10టీ 5జీ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు (ట్రిపుల్ రియర్) మరియు హోల్ పంచ్ డిస్ ప్లే ఉన్నాయి. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర..
ఇది రెండు వేరియంట్లలో రానుంది. వీటిలో 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.13,999కాగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఇది క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుంది. దీనిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
స్పెసిఫికేషన్లు ..
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1,080 x 2,400 పిక్సెల్స్)+ హోల్ పంచ్ అడాప్టివ్ డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hzగా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌తో పాటు 22.5W ఫాస్ట్ చార్జర్‌ను అందిస్తారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌తో లభిస్తుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 190 గ్రాములు బరువును కలిగి ఉంది.
జూలై 26 నుంచి సేల్..
జూలై 26 నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్ (Mi.com), ఎంఐ హోం స్టోర్స్ సహా పలు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా దీని సేల్ ప్రారంభం అవుతుంది. ప్రారంభ ఆఫర్ క్రింద ఇన్ స్టాంట్ డిసౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. కాగా, రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో ఇప్పటికే నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మాక్స్, నోట్ 10 ఎస్ ఫోన్లు రాగా.. తాజాగా ఐదో మోడల్ రిలీజ్ అయింది.