రెడ్‌మీ ఇటీవలే తన కే50 సిరీస్‌ను టీజ్ చేసింది. మార్చి 17వ తేదీన చైనాలో ఇవి లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని షియోమీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు ఫోన్లు లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉండనున్నాయని సమాచారం.
వీటిలో ఒక ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉండనుందని రెడ్‌మీ ప్రకటించింది. దీంతోపాటు 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇందులో ఉండనున్నట్లు సమాచారం. ఈ సెన్సార్‌తో పాటు మరో రెండు కెమెరాలను కూడా షియోమీ ఇందులో అందించనుంది.
రెడ్‌మీ కే50 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... ఇందులో 6.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా... 67W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
రెడ్‌మీ కే50 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ ఉండనున్నట్లు సమాచారం. రెడ్‌మీ కే50 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఈ మూడు ఫోన్లూ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నాయి. ఇవి తప్ప దీని గురించి మిగతా వివరాలు తెలియరాలేదు. ఇటీవలే రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర 3,299 యువాన్ల (సుమారు రూ.39.040) నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?