రెడ్‌మీ కే50 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ టీజ్ చేసింది. రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్‌ను కంపెనీ అధికారి ఒకరు అధికారికంగా ప్రకటించారు. రెడ్‌మీ కే50 సిరీస్‌లో మొత్తం నాలుగు ఫోన్లు ఉండనున్నాయి. రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్, రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్లు ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. ఈ డిటైల్స్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రెడ్‌మీ కే50 సిరీస్ ధరల వివరాలు కూడా లీకయ్యాయి.


రెడ్‌మీ జనరల్ మేనేజర్ లు వెయిబింగ్ వీటిని టీజ్ చేశారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందించే మొదటి ఫ్లాగ్ షిప్ త్వరలో రానుందని చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో షేర్ చేశారు. గతంలో వచ్చిన కథనాల ప్రకారం... రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్, రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ ఫోన్లు మొదట చైనాలో లాంచ్ కానున్నాయి. తర్వాత వేర్వేరు పేర్లతో మిగతా దేశాల్లో వచ్చే అవకాశం ఉంది.


గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ స్ప్రింగ్ ఫెస్టివల్ తర్వాత చైనాలో లాంచ్ కానుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. ఇందులో కొత్త అల్ట్రా వైడ్ బ్యాండ్ సైబర్ ఇంజిన్ హాప్టిక్ ఇంజిన్ ఉండనుంది. ఐఫోన్లలో ఉండే హాప్టిక్స్‌కు పోటీగా ఈ ఫీచర్‌ను యాపిల్ తీసుకురానుందని తెలిసింది.


రెడ్‌మీ కే50 సిరీస్ ధర (అంచనా)
రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ ధర 3,499 యువాన్ల (సుమారు రూ.41,300) నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అన్నిటికంటే చవకైన రెడ్‌మీ కే50 ధర రూ.1,999 యువాన్ల (సుమారు రూ.23,600) నుంచి, రెడ్‌మీ కే50 ధర 2,699 యువాన్ల (సుమారు రూ.31,900) నుంచి, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ ధర 3,299 యువాన్ల (సుమారు రూ.38,900) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీన్ని రెడ్‌మీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


రెడ్‌మీ కే50 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా)
రెడ్‌మీ కే50లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెడ్‌మీ కే50 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8000, రెడ్‌మీ కే50 ప్రో ప్లస్ 9000 ప్రాసెసర్లపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అన్నిటికంటే టాప్ ఎండ్ మోడల్ రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది.