ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో విడుదల కానున్న రెడ్‌మీబుక్ (Redmi Book) 15 ల్యాప్‌టాప్‌ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఆగస్టు 3వ తేదీన విడుదల కానున్న ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి. మనదేశంలో రెడ్‌మీ నుంచి విడుదల కానున్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే.


దీనిలో ఇంటెల్ కోర్ 11వ జనరేషన్ ఐ3, ఐ5 ప్రాసెసర్లు అందించినట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం.. రెడ్‌మీబుక్‌ 15లో 512 జీబీ స్టోరేజ్ ఉండనుంది. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో రానుంది. రెడ్‌మీబుక్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు గత వారం షియోమీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మల్టిపుల్ వెర్షన్లు ఉంటాయా? లేదా? అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. 


ఆసుస్ వివో బుక్, షియోమీకి చెందిన ఎంఐ నోట్ బుక్ 13 ఆరిజన్ ఎడిషన్, ఎసర్ స్విఫ్ట్ 3లకు పోటీగా రెడ్‌మీబుక్ 15 ఉండనుందని తెలుస్తోంది. రెడ్‌మీబుక్ 15 ధర ఇండియాలో రూ.50000 వరకు ఉండవచ్చని అంచనా. ఇది చార్కోల్ గ్రే కలర్ ఆప్షన్లో ఉండనున్నట్లు కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా తెలిసింది. 


ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్ ఉంటుందని తెలిసింది. అలాగే 256 జీబీ, 512 జీబీ పీసీఐఈలు ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఇది విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లుగా.. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ 3.1 టైప్ ఏ, యూఎస్‌బీ 2.0, హెచ్‌బీఎంఐ, ఆడియో జాక్ ఉండనున్నాయి.


దీనికి 65 వాట్స్ ఛార్జర్ కూడా వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు మాత్రం వెల్లడించలేదు. భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్న కొత్త ల్యాప్‌టాప్‌లలో షియోమీ ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది చైనాలో తెచ్చిన ల్యాప్‌టాప్‌లలో వాడిన హార్డ్‌వేర్‌‌కు భిన్నంగా ఉందని లీకుల ద్వారా తెలిసింది.  


రెడ్‌మీబుక్ 15తో పాటుగా షియోమీ మరో కొత్త మోడల్ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ వివరాలు పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. 






ఆగస్టు 3న విడుదల.. 
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ నుంచి త్వరలో ల్యాప్‌టాప్ రానుంది. రెడ్‌మీ బుక్ (Redmi Book) పేరున్న ఈ ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 3వ తేదీన భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను రెడ్‌మీ నోట్ 10టీ (Redmi Note 10T) స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ విడుదల చేయగా.. తాజాగా ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ను వెల్లడించింది. 


మరింత చదవండి: రెడ్‌మీ నుంచి ల్యాప్‌టాప్ .. ఆగస్టు 3న లాంచ్