Redmi 10C: రెడ్‌మీ 10సీ స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ మూడు కొత్త రంగుల్లో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను అందించారు. 2020లో లాంచ్ అయిన రెడ్‌మీ 9సీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.
షియోమీ నైజీరియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఫోన్ లాంచ్‌ను ప్రకటించింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి షియోమీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా లిస్ట్ కాలేదు. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
రెడ్‌మీ 10సీ ధర
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 78,000 నైరాలుగా (సుమారు రూ.14,300) నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 87,000 నైరాలుగా (సుమారు రూ.16,000) ఉంది. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
నైజీరియాలోని రిటైలర్ల వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 3సీ హబ్, స్లాట్.ఎన్‌జీ, ఫినెట్ వంటి వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 10సీ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. రెడ్‌మీ 9సీ మలేషియాలో 429 రింగెట్ల (సుమారు రూ.7,500) ధరతో లాంచ్ అయింది.
రెడ్‌మీ 10సీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను అందించారు.ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఫోన్ వెనకవైపు చదరపు ఆకారంలో కెమెరాలు అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వెనకవైపు అందుబాటులో ఉంది. ఇందులో వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. మనదేశంలో కూడా రెడ్‌మీ 10సీ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?