Realme Narzo: రియల్‌మీ త్వరలో భారతదేశంలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ పేరు రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ. ఈ ఫోన్ లాంచ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.
మార్చిలో లాంచ్
రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ మార్చిలో భారతదేశంలో లాంచ్ కానుంది. రియల్‌మీ ఈ ఫోన్ లాంచ్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అమ్మకానికి అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించింది..
ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్‌లో లైవ్ అయింది. దీని కారణంగా ఫోన్ గురించి అనేక ప్రత్యేక ఫీచర్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్‌లో కంపెనీ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ను అందిస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో రానుంది. 1/1.56 అంగుళాల సెన్సార్ పరిమాణంతో వచ్చే సెన్సార్‌ను ఫోన్ ప్రధాన కెమెరాగా అందించనున్నారు. ఈ ఫోన్ ప్రధాన కెమెరా మునుపటి వెర్షన్ కంటే 64 శాతం ఎక్కువ కాంతిని క్యాప్చర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
అమెజాన్‌లో కనిపించే మైక్రో సైట్‌ను చూస్తే రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని, ఈ ఫోన్ ఫ్లాట్ డిజైన్‌తో వస్తుందని అనుకోవచ్చు. ఈ ఫోన్ వెనుక కెమెరా సెన్సార్ కోసం వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ని కలిగి ఉండవచ్చు. రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీలో మునుపటి వెర్షన్‌తో పోలిస్తే వినియోగదారులు మెరుగైన సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని పొందుతారని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా వినియోగదారులు రియల్‌మీ నార్జో మునుపటి ఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్‌లో మెరుగైన కెమెరా సెటప్‌ను పొందుతారు. అందువల్ల వారి ఫోటోగ్రఫీ అనుభవం కూడా మెరుగ్గా ఉంటుంది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?