Realme GT 6T Sale In India Starts Today: దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ తాజాగా విడుదల చేసిన Realme GT 6T స్మార్ట్‌ ఫోన్‌ను ఇవాళ్టి నుంచి భారత్‌లో అమ్మకాలు షురూ చేస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, రియల్‌మే ఇండియా సైట్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. Realme నుంచి విడుదలైన GT సిరీస్ హ్యాండ్ సెట్ స్నాప్‌ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, 8T LTPO AMOLED డిస్‌ ప్లే, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సహా పలు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది.


రేపు మధ్యాహ్నం నుంచి అధికారిక అమ్మకాలు


Realme GT 6T ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ముందస్తు విక్రయాలను ప్రారంభంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అధికారిక అమ్మకాలు రేపు(మే 29) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతాయని తెలిపింది. రూ. 4,000 బ్యాంక్ ఆఫర్, రూ. 2,000 ఎక్స్చేంజ్ ఆఫర్, 6 నెలల వరకు నో కాస్ట్ EMI సహా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించబోతోంది.  


భారత్ లో Realme GT 6T ధర ఎంతంటే?


Realme GT 6T పలు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తోంది. 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన Realme GT 6T ధర రూ. 30,999గా కంపెనీ నిర్ణయించింది. డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో కలిపి రూ. 24,999కి పొందే అవకాశం ఉంటుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,999గా ఫిక్స్ చేసింది. డిస్కౌంట్ల తర్వాత రూ.26,999కి పొందే అవకాశం ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్ ఉన్న  ఫోన్ థర ధర రూ. 35,999 కాగా, డిస్కౌంట్లతో రూ.29,999కి అందుబాటులో ఉంటుంది. 12GB RAM, 512GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 39,999గా నిర్ణయించింది. డిస్కౌంట్‌లతో రూ. 33,999కి అందుబాటులో ఉంటుంది. 


Realme GT 6T స్పెసిఫికేషన్లు, ఫీచర్లు


తాజాగా స్మార్ట్ ఫోన్ లో 6.78-అంగుళాల 1.5K LTPO 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6,000 నిట్‌ల వరకు బ్రైట్ నెస్ లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌ తో వస్తుంది. 5,500mAh బ్యాటరీతో సపోర్టును కలిగి ఉంటుంది. 120W టైప్ C ఫాస్ట్ ఛార్జర్‌ తో వస్తోంది. ఇది కేవలం 10 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఆండ్రాయిడ్ 14 ఆపరే టింగ్ సిస్టమ్ Realme UI 5.0 తో రన్ అవుతుంది. Google Gemini AI ఫీచర్‌ ను కూడా కలిగి ఉంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ OIS సపోర్టుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.


Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో