రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


రియల్‌మీ జీటీ 2 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది. పేపర్ గ్రీన్, పేపర్ వైట్, స్టీల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


అయితే హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.4,999 విలువైన రియల్‌మీ వాచ్ ఎస్‌ను ఉచితంగా పొందవచ్చు. ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ జరగనుంది.


రియల్‌మీ జీటీ 2 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో 2.0 అమోఎల్ఈడీ సూపర్ రియాలిటీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను దీంట్లో లభించనుంది. రియల్‌మీ స్టెయిన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ మ్యాక్స్ సొల్యూషన్ కూడా ఇందులో అందించారు.


రియల్‌‌మీ జీటీ 2 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 65W సూపర్‌డార్ట్ చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 33 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుందని కంపెనీ అంటోంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను అందించగా... దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ (10 గిగా బైట్), 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?