Realme C67 5G Flipkart Sale: రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. రియల్‌మీ సీ-సిరీస్‌లో లాంచ్ అయిన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే. రియల్‌మీ సీ67 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌తో లాంచ్ అయింది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన 4జీ వెర్షన్ కూడా త్వరలో లాంచ్ కానుందని సమాచారం.
రియల్‌మీ సీ67 5జీ ధర, ఆఫర్లు
రియల్‌మీ సీ67 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. డార్క్ పర్పుల్, సన్నీ ఒయాసిస్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ సీ67 5జీని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అలాగే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు. డిసెంబర్ 20వ తేదీ లోపు ఈ 5జీ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2,000, ఆ తర్వాత కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు ఆఫర్లు లభించనున్నాయి. అయితే ఇది కేవలం ఆన్‌లైన్‌లో కొన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది.
రియల్‌మీ సీ67 5జీ స్పెసిఫికేషన్లు ఇలా...
ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ లెవల్ 680 నిట్స్‌గా ఉంది. సన్నీ ఒయాసిస్ డిజైన్‌ను ఫోన్ వెనకవైపు అందించడం విశేషం. ఈ డిజైన్ కారణంగా సన్‌లైట్‌లో రియల్‌మీ సీ67 5జీ బ్యాక్ ప్యానెల్ షైన్ అవుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 6 జీబీ పెంచుకునే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఓఎస్‌పై రియల్‌మీ సీ67 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా అందించారు. ఐఫోన్ 14 ప్రో, 15 సిరీస్‌లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఈ క్యాప్సూల్ పని చేస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా అందుబాటులో ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.
రియల్‌మీ సీ67 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. కేవలం 29 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది. ఐపీ54 రేటింగ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా అందించారు. ప్రైవసీ, సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!