ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన తొలి ల్యాప్‌టాప్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు రియల్‌మీ బుక్ స్లిమ్. ఇందులో 2కే డిస్‌ప్లేతో (2,160x1,440 పిక్సెల్స్) పాటు 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి. స్క్రీన్‌ టు బాడీ రేషియో 90 శాతంగా ఉంది. ఇది రియల్ బ్లూ, రియల్ గ్రే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో లీగ్ ఆఫ్ లెజెండ్స్, ఓవర్‌వాచ్, షాడో ఆఫ్ ది టోంబ్ రైడర్ వంటి గేమ్స్ ఆడవచ్చని రియల్‌మీ చెబుతోంది. కనెక్టివిటీ ఫీచర్లుగా వైఫై 6, థండర్‌బోల్డ్ 4 ఉన్నాయి. 






రెండు వేరియంట్లలో..
రియల్‌మీ బుక్ స్లిమ్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ3 వేరియంట్ ధర రూ.46,999గా, ఐ5 వేరియంట్ ధర రూ.59,999గా ఉంది. ఐ3 వేరియంట్‌లో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, ఐ5 వేరియంట్‌లో 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ అందించారు. వీటి సేల్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ డాట్ కాం వెబ్ సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రారంభ ఆఫర్ కింద ఐ3 వేరియంట్‌ను రూ.44,999కు, ఐ5 వేరియంట్‌ను రూ.56,999 డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. 


రియల్‌మీ బుక్ స్లిమ్ ఫీచర్లు ఇవే.. 
రియల్‌మీ బుక్ స్లిమ్ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల 2కే ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. 14.9 మిల్లీమీటర్ల సూపర్ స్లిమ్ డిజైన్ కలిగి ఉంది. యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో ఇది పనిచేయనుంది. దీనిని విండోస్ 11కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఇందులో 400 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. దీని వల్ల సాధారణ ల్యాప్‌టాప్‌ల కంటే 33 శాతం అధిక బ్రైట్‌నెస్ కలిగి ఉంది. స్క్రీన్‌ టు బాడీ రేషియో 90 శాతంగా ఉంది. ఇది యాపిల్ మాక్ బుక్‌ ఎయిర్‌లో 82 శాతంగా ఉంది.  







  • మొబైల్‌ను పీసీకి కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా పీసీ కనెక్ట్ అనే ఫీచర్ అందించింది. ఈ ఫీచర్ ఫైల్స్‌ను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడనుంది. 

  • బ్యాటరీ లైఫ్ 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో 65 వాట్స్ (టైప్ సీ), 30 వాట్స్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. 

  • ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేందుకు డ్యూయల్ ఫ్యాన్ స్ట్రోమ్ కూలింగ్ సిస్టం ఉంటుంది. 

  • సూపర్ లార్జ్ టచ్‌ప్యాడ్‌తో కూడిన బాక్ లిట్ కీబోర్డు అందించింది. దీని బరువు 1.38 కేజీలుగా ఉంది.


Also Read: Redmi Laptop: ప్రొఫెషనల్స్ కోసం రెడ్ మీ బుక్ ప్రో….స్టూడెంట్స్ కోసం రెడ్ మీ బుక్ ఈ-లెర్నింగ్… రెడ్ మీ నుంచి భారత మార్కెట్లోకి తొలి ల్యాప్ టాప్


Also Read: Tips For Laptop: ల్యాప్ టాప్ వాడుతున్నారా? అయితే ఈ తప్పులు చేస్తున్నారా చూసుకోండి