Poco X6 Series: పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతంటే?

Poco X6 Series Launch: పోకో ఎక్స్6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కంపెనీ మనదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

Continues below advertisement

Poco X6 Pro: పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ బేస్ మోడల్లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించారు. వీటి రిజల్యూషన్ 1.5కే కాగా, వెనకవైపు 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాలు కూడా ఉన్నాయి. పోకో ఎక్స్6 బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, పోకో ఎక్స్6 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. వీటి ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం 67Wగా ఉంది.

Continues below advertisement

పోకో ఎక్స్6 ధర (Poco X6 Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999గానూ, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర రూ.22,999గానూ ఉంది. స్నోస్టార్మ్ వైట్, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో పోకో ఎక్స్6ను కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎక్స్6 ప్రో ధర (Poco X6 Pro Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలోనే అందుబాటులో ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999గా నిర్ణయించారు. పోకో ఎల్లో, రేసింగ్ గ్రే, స్పెక్టర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

జనవరి 16వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.

పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎక్స్6 స్పెసిఫికేషన్లు
ఈ రెండు ఫోన్లలోనూ డ్యూయల్ సిమ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు ఫోన్లకూ మూడు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నారు. ఇందులో 6.67 అంగుళాల 1.5కే డిస్‌ప్లేలు అందించారు. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పోకో ఎక్స్6 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్, పోకో ఎక్స్6లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండనున్నాయి.

పోకో ఎక్స్6, ఎక్స్6 ప్రోల్లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా అందించారు.సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఉన్నాయి. యాక్సెలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు కూడా అందించారు. వీటిలో పోకో ఎక్స్6 బ్యాటరీ సామర్థ్యం 5100 ఎంఏహెచ్ కాగా, పోకో ఎక్స్6 ప్రో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ రెండు ఫోన్లు 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Continues below advertisement
Sponsored Links by Taboola