పోకో ఎక్స్4 5జీ ఇండియన్ వేరియంట్ గీక్ బెంచ్‌లో కనిపించింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉండనుంది. 6 జీబీ వరకు ర్యామ్ కూడా ఇందులో అందించనున్నారు. ఈ ఫోన్ ఇటీవలే వేర్వేరు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కూడా కనిపించింది. గత నెలలో గ్లోబల్ లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది.


షియోమీ 2201116PI మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. పోకో ఎక్స్4 5జీకి ఇండియన్ వేరియంట్‌తో ఈ ఫోన్ మోడల్ నంబర్ అసోసియేట్ అయి ఉంది. గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 688 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 2052 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్‌తో గీక్ బెంచ్‌లో కనిపించింది. కాబట్టి ఇంకా ఎక్కువ ర్యామ్ ఉండే వేరియంట్లు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


పోకో ఎక్స్4 5జీకి సంబంధించిన మరిన్ని వేరియంట్లు కూడా కనిపించాయి. 2201116PI మోడల్ నంబర్ ఉన్న వెబ్ సైట్ బీఐఎస్ వెబ్ సైట్‌లో కూడా కనిపించింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ షియోమీ 2201116G మోడల్ నంబర్‌తో కనిపించింది.


షియోమీ 2201116PG మోడల్ నంబర్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఇటీవలే యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం.. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎక్స్4 5జీ రానుంది.


ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.