Poco M6 5G Airtel Exclusive: పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో 2023 డిసెంబర్‌లో లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్‌లో మూడు ర్యామ్, మూడు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే వన్ టైమ్ ఆఫర్ కింద ఎక్స్‌క్లూజివ్ ప్రీపెయిడ్ బండిల్ లభించనుంది. గతంలో పోకో సీ51కు సంబంధించిన ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ వెర్షన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది.


మార్చి 10వ తేదీ నుంచి ఎయిర్‌టెల్ ఎక్స్‌క్లూజివ్ వెర్షన్ భారతదేశంలో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ.8,799గా ఉండనుంది. ఈ మొబైల్ కొనుగోలు చేస్తే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు 50 జీబీ వన్ టైమ్ మొబైల్ డేటా లభించనుంది. ఒకవేళ మీ దగ్గర ఎయిర్‌టెల్ సిమ్ లేకపోతే డోర్‌స్టెప్ సిమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు.


గతేడాది డిసెంబర్‌లో పోకో ఎం6 5జీ మార్కెట్లో లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.11,499గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499గానూ నిర్ణయించారు. గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ, పొలారిస్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


పోకో ఎం6 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌‌గానూ ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.


ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ ఏఐ బ్యాక్డ్ ప్రధాన సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు మరో లెన్స్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


మరోవైపు మనదేశంలో ఇటీవలే లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 20సీ సేల్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డైనమిక్ పోర్టు ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ టెక్నో స్పార్క్ 20సీలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999గా ఉంది. కానీ లాంచ్ ఆఫర్ ద్వారా రూ.7,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?