ప్రముఖ బ్రాండ్ పెబుల్ మన దేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్ వాచ్. ఇందులో 1.96 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ వాచ్ అందించనుంది. మ్యాగ్నటిక్ స్ట్రాప్, రొటేటింగ్ క్రౌన్‌తో ఈ వాచ్ రానుంది. బ్లూటూత్ కాలింగ్, మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఎన్నో వాచ్ ఫేసెస్ ఇందులో ఉన్నాయి.


పెబుల్ కాస్మోస్ వోగ్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్‌ను మనదేశంలో రూ.2,499గా నిర్ణయించారు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జెట్ బ్లాక్, మిడ్ నైట్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, క్లాసిక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ లాంచ్ అయింది.


పెబుల్ కాస్మోస్ వోగ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మెటాలిక్ డయల్‌ను అందించారు. దీని అంచులు గుండ్రంగా ఉండనున్నాయి. సిలికాన్, మెటాలిక్ మ్యాగ్నెటిక్ స్ట్రాప్స్ దీంతో పాటు అందించనున్నారు. 1.96 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ వాచ్‌లో అందించనున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది. బ్లూటూత్ కాలింగ్ ద్వారా వినియోగదారులు కాల్స్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది.


దీంతో పాటు ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, యాక్టివిటీ ట్రాకర్లు కూడా అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‌తో ఈ వాచ్ లాంచ్ అయింది.


దీని బ్యాటరీ సామర్థ్యం 240 ఎంఏహెచ్‌గా ఉంది. వైర్డ్ మ్యాగ్నటిక్ ఛార్జింగ్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏడు రోజుల రెగ్యులర్‌గా ఈ వాచ్ వాడుకోవచ్చు. అలారం, జెన్ మోడ్, డిస్‌ప్లే టైమర్, స్టెప్ పీడోమీటర్, ఇంటర్‌ఛేంజబుల్ స్ట్రాప్స్, కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియాకు నోటిఫికేషన్లు కూడా ఉండనున్నాయి.





Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?