ఒప్పో రెనో 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లు చైనాలో గతంలోనే లాంచ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనదేశంలో కూడా లాంచ్ చేయడానికి ఒప్పో సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లను ఒప్పో మనదేశంలో టీజ్ చేసింది. ఒప్పో రెనో 7 సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు ఉన్నాయి. అవే ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7, ఒప్పో రెనో 7 ఎస్ఈ.


ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్లను గతంలోనే టీజ్ చేసింది. ఈ ఫోన్లు ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం.. సోనీ ఐఎంఎక్స్709 అల్ట్రా సెన్సింగ్ సెన్సార్‌తో (32 మెగాపిక్సెల్) లాంచ్ కానున్న మొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. దీంతోపాటు ఇందులో ఫ్లాగ్ షిప్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ (50 మెగాపిక్సెల్ కెమెరా) కూడా ఉండనుంది.


చైనాలో లాంచ్ అయిన వేరియంట్లలో ఈ సెన్సార్లను అందించారు. ఒప్పో రెనో 7 5జీ ధర మనదేశంలో రూ.28 వేల నుంచి రూ.31 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఒప్పో రెనో 7 ప్రో 5జీ ధర రూ.41,000 నుంచి రూ.43,000 మధ్యలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.


ఒప్పో రెనో 7 5జీ స్పెసిఫికేషన్లు(అంచనా)
ఈ స్మార్ట్ ఫోన్ చైనా వేరియంట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఒప్పో రెనో 7 5జీలో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు.


ఒప్పో రెనో 7 5జీ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 60W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఒప్పో రెనో 7 5జీ పనిచేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 7 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 ఒప్పో లేటెస్ట్ ఫోన్‌లో సెన్సార్‌ను అందించారు.


5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు.


ఒప్పో రెనో 7 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో రెనో 7 ప్రో 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఒప్పో రెనో 7 ప్రో 5జీ పనిచేయనుంది.


ఇందులో కూడా వెనకవైపు మూడు కెమెరాలే అందించారు. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌లు ఇందులో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మిగతా ఫీచర్లన్నీ ఒప్పో రెనో 7 5జీ లోవే అందించారు.


Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి