ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇటీవలే మనదేశంలో ఒప్పో రెనో 7 5జీ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ కూడా మనదేశంలో ప్రారంభం అయింది. ఎంఐ 11ఎక్స్, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, వన్‌ప్లస్ నార్డ్ 2లతో ఈ స్మార్ట్ ఫోన్ పోటీ పడనుంది.
ఒప్పో రెనో 7 5జీ ధర (Oppo Reno 5G Price)
ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఇందులో కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌ట్రయల్స్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ప్రారంభ ఆఫర్ కింద ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా దీనిపై అందుబాటులో ఉన్నాయి.
ఒప్పో రెనో 7 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Oppo Reno 5G Specifications, Features)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 5జీ ప్రాసెసర్‌పై ఇది పనిచేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్709 సెన్సార్‌ను ఒప్పో అందించింది.
బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. గైరోస్కోప్, యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లు కూడా ఇందులో అందించారు.