CyberShakti: భారత్‌, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు సరిహద్దులకు మాత్రమే పరిమితం కాలేదు. డిజిటల్ ప్రపంచంలో కూడా  ప్రతిధ్వనిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒక సైబర్ ఆపరేషన్ "ఆపరేషన్ సైబర్ శక్తి" లో భాగంగా భారతీయ హ్యాకర్లు పాకిస్తాన్ అనేక ముఖ్యమైన వెబ్‌సైట్‌లు,  ఆన్‌లైన్ వ్యవస్థపై పడ్డారు. భారతీయ హ్యాకర్ల దెబ్బకు పాకిస్థాన్‌లోని కీలక వ్యవస్థలు ఆగమాగమయ్యాయి. 

Continues below advertisement


ఆపరేషన్ సైబర్ శక్తి అంటే ఏమిటి?


ఇది భారతీయ "విజిలెంట్" హ్యాకర్లు నిర్వహిస్తున్న ఒక అనధికారిక సైబర్ క్యాంపెయిన్. ఇందులో పాకిస్థాన్‌పై డిజిటల్ యుద్ధం చేస్తుంటారు. ఇక్కడ వార్ కోడ్‌లు,  కీబోర్డ్‌ల ద్వారా జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్‌కు చెందిన అనేక ప్రభుత్వ, రక్షణ సంబంధిత వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. నివేదికల ప్రకారం, ఈ క్యాంపెయిన్‌లో ఫిషింగ్, డేటా బ్రీచ్, వెబ్‌సైట్ డిఫేస్‌మెంట్ వంటి హై-ప్రొఫైల్ సైబర్ దాడులు చేపట్టారు. ఈ మిషన్ వెనుక ఎటువంటి ప్రభుత్వ సంస్థ లేదు, కానీ ఇది స్వతంత్ర హ్యాకింగ్ గ్రూప్, ఇది సరిహద్దులో జరుగుతున్న  దుశ్చర్యలకు ఇలా డిజిటల్ ప్రతిస్పందన ఇస్తోంది.


పాకిస్తాన్ సైబర్ భద్రతపై ప్రభావం


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ముందుగా ట్విట్టర్) లో పంచుకున్న సమాచారం ప్రకారం, ఆపరేషన్ సైబర్ శక్తిలో భాగంగా పాకిస్తాన్ జైళ్లకు సంబంధించిన డేటాను లీక్ చేశారు. అంతేకాకుండా, సైనిక ఇంజనీరింగ్ సర్వీసుల డేటాబేస్ కూడా సైబర్ దాడి బారిన పడింది. పాకిస్తాన్ పాత పవర్ ప్లాంట్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన డేటాను కూడా యాక్సెస్ చేశారని వాదన ఉంది. 


700 కంటే ఎక్కువ వెబ్‌సైట్‌లు, 1000 CCTV కెమెరాలు హ్యాక్ 


ఈ హ్యాకర్ గ్రూప్ ప్రకారం, వారు ఇప్పటి వరకు 700 కంటే ఎక్కువ పాకిస్తాన్ వెబ్‌సైట్‌లను డౌన్ చేశారు. 1000 కంటే ఎక్కువ CCTV నెట్‌వర్క్‌లను యాక్సెస్ చేశారు. ఈ దాడి భారతదేశం నుంచి మాత్రమే కాదు, సింగపూర్, అమెరికా వంటి ప్రదేశాల నుంచి కూడా జరిగింది, దీని వలన అనేక పాకిస్తాన్ సైట్లు అంతర్జాతీయ స్థాయిలో కూడా యాక్సెస్ చేయలేకపోయాయి.


భారత్ ప్రతీకార దాడిలో పాకిస్థాన్‌కు భారీ నష్టం 


2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. భారత సైన్యం పాకిస్తాన్‌ను గట్టిగానే దెబ్బ కొట్టింది. ఆ విధ్వంసాన్ని దాచి పెట్టడానికి పాకిస్థాన్ చాలా ప్రయత్నం చేసింది కానీ అది వీలు కావడం లేదు. దీనికి ఉదాహరణ  భారత్‌ దాడిలో ధ్వంసమైన రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ఇప్పుడు పనిచేయడం లేదు. అక్కడ మరమ్మత్తు చేపడుతోంది. 


పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ ఎయిర్‌బేస్, ఏకైక రన్‌వేను ఒక వారం పాటు మూసివేశారు. ఎయిర్‌మెన్‌లకు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (PCAA) జారీ చేసిన నోటీసులో ఇది స్పష్టమైంది. NOTAM పాకిస్తాన్ సమయం ప్రకారం శనివారం (మే 10, 2025) సాయంత్రం 4 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. మే 18 వరకు కొనసాగుతుంది.


రన్‌వేను మూసివేయడానికి కారణం పని పురోగతిలో ఉందని NOTAM తెలిపింది.  కానీ పాకిస్తాన్ చాకచక్యంగా వ్యవహరించి దానిని మూసివేయడానికి గల కారణాలను చెప్పలేదు. ఇది విమాన కార్యకలాపాలకు అందుబాటులో ఉండదని మాత్రమే చెప్పింది. అందుకే నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారతదేశం ప్రతీకార దాడి చేసినట్లు స్పష్టమైంది.