OnePlus Watch 2 : ప్రముఖ చైనీస్ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన వచ్చే ప్రొడక్టుకు దేశీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఆ సంస్థ నుంచి తాజాగా అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ అయ్యింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2024లోOnePlus తన సెకెండ్ జెనరేషన్ వాచ్‌ను ఆవిష్కరించింది. OnePlus Watch 2 పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఈ వాచ్ లాంచ్ లైఫ్ బ్యాటరీ, మెరుగైన డిజైన్, చక్కటి ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాదు, గూగుల్ లేటస్ట్ Wear OS 4తో రన్ అవుతోంది.
OnePlus వాచ్ 2 డిజైన్:
OnePlus 12 సిరీస్ డిజైన్ కు కొనసాగింపుగా OnePlus వాచ్ 2ను రూపొందించారు. ఈ వాచ్ 2.5D నీలంరంగు క్రిస్టల్ కవర్‌తో వస్తుంది. వాచ్ ఛాసిస్ MIL-STD-810H స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. తాజా స్మార్ట్ వాచ్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. సుమారు 80 గ్రాముల బరువు ఉంటుంది.
OnePlus వాచ్ 2 స్పెసిఫికేషన్లు:
OnePlus వాచ్ 2 466 x 466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 600 నిట్స్ బ్రైట్ నెస ను కలిగి ఉంది. తాజా స్మార్ట్ వాచ్ BES 2700 MCU ఎఫిషియెన్సీ చిప్ సెట్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ W5 SoCపై రన్ అవుతుంది. OnePlus వాచ్ 2 Google Wear OS 4 ఆధారంగా పని చేస్తుంది. 2GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
100 గంటల బ్యాటరీ బ్యాకప్:
OnePlus వాచ్ 2 500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 'స్మార్ట్ మోడ్'లో 100 గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది. నిరంతరం ఉపయోగిస్తే 48 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం ఉంటుంది. 7.5W VOOC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో వాచ్ 2ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని OnePlus వెల్లడించింది.
భారత్ లో OnePlus వాచ్ 2 ధర ఎంత అంటే?:
OnePlus వాచ్ 2 ధర భారత్ లో రూ.24,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది Amazon, Flipkart, Reliance, Cromaతో పాటు OnePlus అధికారిక స్టోర్లు సహా అన్ని ముఖ్యమైన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో మార్చి 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభం అవుతుంది.
OnePlus వాచ్ 2 ఓపెనింగ్ ఆఫర్లు:
OnePlus ICICI బ్యాంక్ OneCardతో కొనుగోలు చేసినట్లు అయితే రూ.2,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 మధ్యన రెడ్ కేబుల్ క్లబ్‌కు తమ డివైజ్ ను లింక్ చేసే కస్లమర్లకు అదనంగా మరో రూ. 1000 వరకు తగ్గింపు ఇవ్వనుంది.
Read Also: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!