వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్ గురించి కొత్త లీకులు వినిపిస్తున్నాయి. వీటిని బట్టి ఈ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ 10 అల్ట్రాతో పాటు వన్‌ప్లస్ నార్డ్ 2టీ గురించి కూడా ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.


వన్‌ప్లస్ నార్డ్ 2టీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మనదేశంలో ఫిబ్రవరిలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఏకంగా 80W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది. అంటే దాదాపు 40 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుందన్న మాట.


ఇందులో హెచ్‌డీ+ స్క్రీన్‌ను కంపెనీ అందించే అవకాశం ఉంది. ఇక దీని మిగతా స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.43 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.30 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


దీంతోపాటు వన్‌ప్లస్ 10 అల్ట్రా అనే ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను కూడా కంపెనీ రూపొందిస్తుందని తెలుస్తోంది. వన్‌ప్లస్ ఇటీవలే 10 ప్రో స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మనదేశంలో ఇంకా లాంచ్ కావాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో నెవ్వర్ బిఫోర్ ఫీచర్లు ఉండనున్నాయని తెలుస్తోంది.


ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ తెలిపిన దాని ప్రకారం.. ఒప్పో, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇప్పటికే భాగస్వామ్యం ఏర్పరచుకున్నాయి. ఒప్పో మారిసిలికాన్ చిప్‌సెట్‌ను కంపెనీ వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌లో ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లాంచ్ కానున్నట్లు సమాచారం.


ఒప్పో ఫైండ్ ఎక్స్5 స్మార్ట్ ఫోన్‌లో హాజిల్ బ్లాడ్ టెక్నాలజీని అందించనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రోలో అందించే ఫ్లాగ్ షిప్ తరహా కెమెరానే ఇందులో కూడా అందించారు. వన్‌ప్లస్ 10 అల్ట్రాలో ప్రత్యేకమైన ఇమేజింగ్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్21 సిరీస్, షియోమీ 11 అల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లతో పోటీ పడనుంది.