OnePlus 11R లాంచింగ్ కు ఓవైపు కంపెనీ ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ఈ మోబైల్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు ఆన్ లైన్ వేదికగా లీక్ అయ్యాయి. ఫిబ్రవరి 7న జరిగే ఈ ఈవెంట్ లో వన్ ప్లస్ పలు మోబైల్ ఫోన్లను ఆవిష్కరించబోతున్నది. ఇందులో ప్రధానంగా వన్‌ప్లస్ 11తో పాటు వన్‌ప్లస్ 11R అనే సరసమైన మోడల్‌ను ఆవిష్కరిస్తుంది. OnePlus ఇప్పటికే OnePlus 11Rని లాంచ్ చేయబోతున్నట్లు ధృవీకరించింది. తాజాగా OnePlus 11Rకు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఫోన్ కు సంబంధించిన అనేక వివరాలు బయటకు వచ్చాయి.
స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే!
MySmartPrice నివేదిక ప్రకారం OnePlus 11R Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ సరసమైన OnePlus ఫోన్ 8GB RAMతో పాటు 128GB ఇన్ బిల్ట్ మెమరీని కలిగి ఉంటుంది. ఇవి బేస్ మోడల్ కోసం రూపొందించారు. OnePlus 11R భారత మార్కెట్లో గెలాక్టిక్ సిల్వర్ రంగులో విక్రయాలు జరుపుకోనున్నట్లు లీక్ వివరాలను బట్టి తెలుస్తోంది. ఫోన్ కు సంబంధించిన మరికొన్ని అద్భుత స్పెసిఫికేషన్లు కూడా బయటకు వచ్చాయి.
అమెజాన్ లో అందుబాటులో..
OnePlus 11 మాదిరిగానే OnePlus 11R అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని కూడా ధృవీకరించబడింది. అధికారిక టీజర్ రాబోయే ఫోన్ కు సంబంధించిన ఆకృతిని వివరించింది. ఇది వెనుక ప్యానెల్ తో పాటు సైడ్ నుంచి కొన్ని భాగాలను కనిపించేలా చేసింది. ఫోన్ పూర్తి డిజైన్ ఇప్పటికీ బయటకు రాలేదు. ఇక ఈ ఫోన్ కు సంబంధించిన లీకుల ప్రకారం, OnePlus 11R పంచ్-హోల్ నాచ్‌తో కూడిన కర్వ్డ్ డిస్ ప్లేతో రానుంది. OnePlus 11R అనేది OnePlus 10 Pro, OnePlus 10T మాదిరిగానే కనిపించే డిజైన్‌తో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. OnePlus 11R కూడా ఒక IR బ్లాస్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది OnePlus 10Rలో లేదు.
OnePlus 11R లాంచింగ్ ఎప్పుడంటే?
ఫిబ్రవరి 7న ఈ లాంచింగ్ వేడుక ఘనంగా జరగనుంది. ఇందులో OnePlus 11, OnePlus 11R ఫోన్లతో పాటు 65-అంగుళాల OnePlus TV, OnePlus బడ్స్, మరిన్ని పరికరాలను కంపెనీ ఆవిష్కరించనుంది. అటు అధికారిక లాంచ్‌కు ముందే OnePlus 11 ధర లీక్ అయింది. నివేదికల ప్రకారం, OnePlus ఫోన్ 12GB RAM , 256GB స్టోరేజ్‌తో బేస్ మోడల్ రూ.54,999 ధరతో ప్రారంభమవుతుంది. OnePlus 11 16GB RAM, 512GB అంతర్గత నిల్వతో మరో రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు, ఈ మోడళ్ల ధర రూ.59,999, రూ.66,999గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇప్పటికే వృత్తాకార వెనుక కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ డిస్‌ప్లేతో OnePlus 11 రూపకల్పన చేసినట్లు కంపెనీ ధృవీకరించింది. OnePlus 11 ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. అదే మోడల్ అదే స్పెసిఫికేషన్‌లతో భారతదేశ మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఇంకా OnePlus 11R స్పెక్స్‌ను వెల్లడించలేదు.
iQOO 11తో OnePlus 11 పోటీ
OnePlus 11 స్మార్ట్ ఫోన్ iQOO 11తో పోటీ పడనుంది. డిస్‌ప్లే పరంగా, iQOO 11 6.78-అంగుళాల 2K AMOLED LTPO 4.0 డిస్‌ప్లేతో 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మరోవైపు, OnePlus 11 6.7-అంగుళాల QHD+ E4 OLED LTPO 3.0 డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ను కలిగి ఉంటుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. అయితే, వెనుక కెమెరా కాన్ఫిగరేషన్లు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. iQOO 11 50MP ప్రైమరీ Samsung GN5 సెన్సార్‌తో f/1.88 ఎపర్చరుతో వస్తుంది. OnePlus 11 OISతో 50MP Sony IMX890 సెన్సార్, 48MP సోనీ IMX581 అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 32MP సోనీ IMX709 2x టెలిఫోటో సెన్సార్ తో వస్తుంది.
Read Also: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..