వన్‌ప్లస్ 10ఆర్ త్వరలో లాంచ్ కావడానికి సిద్ధం అవుతుందని తెలుస్తోంది. చైనాలో, మనదేశంలో ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ 10 ప్రో ఇప్పటికే చైనాలో లాంచ్ అయింది. త్వరలో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్‌కు సిద్ధం అవుతోంది.


ఒప్పో ఫైండ్ ఎక్స్5తో పాటు ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో మనదేశంలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఆండ్రాయిడ్ సెంట్రల్ కథనం ప్రకారం.. వన్‌ప్లస్ 10ఆర్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉండనుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.


2022 రెండో త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఆసియా మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వన్‌ప్లస్ 9ఆర్, వన్‌ప్లస్ 9ఆర్‌టీ కేవలం ఆసియా మార్కెట్లలోనే అందుబాటులో ఉన్నాయి.


వన్‌ప్లస్ 10లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కాకుండా వేరే ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్ 10 అమెరికాలో కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ కోర్ కాన్ఫిగరేషన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ తరహాలోనే ఉంది.


ఇందులో సబ్-6 5జీ బ్యాండ్లు ఉండనున్నాయి. వన్‌ప్లస్ టీవీకి సంబంధించిన రెండర్లు కూడా ఇటీవలే ఆన్‌లైన్‌లో కనిపించాయి. మనదేశంలో త్వరలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ డిజైన్ అదేనని తెలుస్తోంది. ఈ రెండర్ల ప్రకారం.. ఈ ఫోన్ అంచులు సన్నగా ఉండనున్నాయి. వన్‌ప్లస్ లోగో టీవీ కిందవైపు ఉండనుంది.


ఈ టీవీ 32 అంగుళాలు, 43 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అందుబాటులోకి రానుంది. వీటి ధర రూ.25 వేల రేంజ్‌లోనే ఉండనుంది. అయితే వన్‌ప్లస్ వీటిని అధికారికంగా ప్రకటించలేదు.


Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి