Nubia Red Magic 7 Pro Lauched: నుబియా రెడ్ మ్యాజిక్ 7 ప్రో లాంచ్ అయింది. గేమింగ్ ఫోన్లు లాంచ్ చేయడంలో నుబియా దిట్ట. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది. ఇందులో అండర్ డిస్‌ప్లే కెమెరా, రెడ్ కోర్ 1 డెడికేటెడ్ గేమింగ్ చిప్, వేగవంతమైన రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉండనున్నాయి.


నుబియా రెడ్ మ్యాజిక్ 7 ప్రో ధర
ఇందులో డార్క్ నైట్, సైబర్ నియోన్, డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వేర్వేరు వేరియంట్లు ఉండనున్నాయి.


నుబియా రెడ్‌మ్యాజిక్ 7 ప్రో డార్క్ నైట్ ఎడిషన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,799 యువాన్లుగా (సుమారు రూ.56,800) నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,199 యువాన్లుగా (సుమారు రూ.61,500) ఉంది. వీటిలో టాప్ ఎండ్ అయిన 16 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధర 5,599 యువాన్లుగా (సుమారు రూ.66,200) నిర్ణయించారు. సైబర్ నియాన్ ఎడిషన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 5,199 యువాన్లుగా (సుమారు రూ.61,500) ఉండనుంది.


ఇక నుబియా రెడ్ మ్యాజిక్ 7 ప్రో డ్యూటీరియం బ్లేడ్ ట్రాన్స్‌పరెంట్ ఎడిషన్‌లో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లుగా (సుమారు రూ.62,700) నిర్ణయించారు. 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 5,699 యువాన్లుగానూ (సుమారు రూ.67,400) నిర్ణయించారు. 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,499 యువాన్లుగా (సుమారు రూ.77,000) ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 18 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 7,499 యువాన్లుగా (సుమారు రూ.88,700) ఉండనుంది. ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలియరాలేదు.


నుబియా రెడ్ మ్యాజిక్ 7 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రెడ్ మ్యాజిక్ 5.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. గేమింగ్ కోసం 6.8 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 960 హెర్ట్జ్‌గా ఉంది. రెడ్ కోర్ 1 డెడికేటెడ్ గేమింగ్ చిప్ ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఐస్ 9.0 కూలింగ్ సిస్టంను కూడా అందించారు. 18 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 135W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఫోన్‌తో పాటు 165W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.2, వైఫై 6, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.99 సెంటీమీటర్లు కాగా... బరువు 235 గ్రాములుగా ఉంది.