Nothing Smartphone: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ (Carl Pei) తన కొత్త స్టార్టప్ ‘నథింగ్’ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. గత నెలలో కార్ల్ పెయ్ ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేశాడు. ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం... ఈ ఫోన్ వచ్చే నెలలోనే లాంచ్ కానుంది.


నథింగ్ ఇయర్ బడ్స్ తరహాలోనే ఈ ఫోన్ కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ కానుందని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ గురించి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. టెక్ క్రంచ్ కథనం ప్రకారం... బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ ప్రొటో టైప్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.


దీన్ని స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కొందరు కీలక చిప్ డిజైనర్లకు చూపించినట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ దాదాపు ఒక సంవత్సరం పని చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్లు కూడా ఇంతవరకు లీకవ్వలేదు. ఫిబ్రవరి 16వ తేదీన పెయ్ ట్విట్టర్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేశాడు.


ఈ ట్వీట్లకు ఆండ్రాయిడ్, స్నాప్‌డ్రాగన్ రెండూ స్పందించాయి. తాను భవిష్యత్తులో లాంచ్ చేయబోయే ఉత్పత్తుల కోసం క్వాల్‌కాంతో చేతులు కలిపినట్లు నథింగ్ 2021 అక్టోబర్‌లోనే తెలిపింది. నథింగ్ స్మార్ట్ ఫోన్‌పై పనిచేస్తున్నట్లు గతేడాదే వార్తలు వచ్చాయి.


ఈ ఫోన్ 2022 ప్రారంభంలో లాంచ్ కానుందని కూడా అప్పుడే నిపుణులు అంచనా వేశారు. దీంతోపాటు కంపెనీ పవర్ బ్యాంక్‌ను రూపొందించడానికి కూడా పనిచేస్తుందని తెలుస్తోంది. అది నథింగ్ పవర్ (1) అయ్యే అవకాశం ఉంది. అయితే నథింగ్ ఈ డివైసెస్ గురించి ఇంకా తెలపాల్సి ఉంది.


స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఎసెన్షియల్‌ను కూడా నథింగ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ సహకారంతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించే అవకాశం ఉంది.


Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!