Common Password: ఇంటర్నెట్ ప్రపంచంలో బ్యాంకింగ్, సోషల్ మీడియా, యాప్స్ కోసం పాస్‌వర్డ్‌లను సిద్ధం చేయడం అతిపెద్ద సవాలుగా మారింది. ఈ కారణంగా చాలా మంది సాధారణ పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారు. వీటిని హ్యాకర్లు ఒక్క నిమిషంలో క్రాక్ చేయగలరు. ఇటీవల నార్డ్ పాస్ అనే పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ సంస్థ నివేదిక ప్రకారం... భారతీయులతో సహా ప్రపంచంలోని చాలా మంది ప్రజలు 2023 సంవత్సరంలో అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌ను ఉపయోగించారని తెలిపారు. అదే '123456'.  నార్డ్‌పాస్ నివేదిక ప్రకారం యూజర్లు 2023లో తమ స్ట్రీమింగ్ ఖాతాల కోసం బలహీనమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించారు.


నార్డ్‌పాస్ నివేదిక ప్రకారం చాలా మంది ఇంటర్నెట్ యూజర్లు తమ పాస్‌వర్డ్‌లో దేశం పేరునే ఉంచుకుంటారు. ఎక్కువ మంది భారతీయులు ‘India@123’గా ఉంటుంది. భారత్‌తో సహా ప్రపంచంలో మొత్తంలో ఈ తరహా పాస్‌వర్డ్‌లను కలిగి ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నార్డ్‌పాస్ తన నివేదికలో పేర్కొంది. దీంతోపాటు ప్రజలు ఎక్కువగా 'admin' అనే పదం కూడా ఉపయోగిస్తున్నారు. భారతదేశం సహా అనేక ఇతర దేశాలలో అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లలో ఇది ఒకటిగా మారింది.


గతేడాది 'password' అగ్రస్థానంలో...
గతేడాది చాలా మంది 'password'ని పాస్‌వర్డ్‌గా ఉపయోగించారు. భారతదేశంలో వినియోగదారులు pass@123 లేదా password@123ని ఎక్కువగా ఉపయోగించారు. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగించే పాస్‌వర్డ్‌ల గురించి తెలుసుకోవడానికి పరిశోధకులు అనేక మాల్వేర్‌ల ద్వారా లీక్ అయిన పాస్‌వర్డ్‌లకు సంబంధించి 6.6 టీబీ డేటాబేస్‌ను విశ్లేషించారు. నిపుణులు దీనిని వ్యక్తుల సైబర్ భద్రతకు భారీ ముప్పుగా భావిస్తారు. ఇక్కడ మరింత భయంకరమైన విషయం ఏమిటంటే బాధితులు మాల్వేర్ తమ కంప్యూటర్‌కు సోకిందని కూడా గ్రహించలేరు.


ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాస్‌వర్డ్‌లలో దాదాపు మూడో వంతు (31 శాతం) పూర్తిగా '123456789', '12345', '000000'... ఇలా అనే నంబర్ సిరీస్‌లతో రూపొందాయి. నార్డ్ పాస్ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం గ్లోబల్ లిస్ట్‌లోని 70 శాతం పాస్‌వర్డ్‌లను సెకను కంటే తక్కువ వ్యవధిలో క్రాక్ చేయవచ్చు. పరిశోధకులు మెరుగైన భద్రత కోసం ‘పాస్‌వర్డ్’లకు బదులు పాస్‌కీ రూపొందించారు. ఈ సాంకేతికత చెడు పాస్‌వర్డ్‌లను తొలగించడంలో సహాయపడుతుందని, వినియోగదారులను మరింత సురక్షితంగా చేస్తుందని స్మాలాకిస్ చెప్పారు.


మరోవైపు వాట్సాప్, గూగుల్ సంస్థలు త్వరలో ఛాట్ బ్యాకప్ కోసం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ కోటాను ఎండ్ చేయనున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం మీరు వాట్సాప్‌లో ఎంత డేటానైనా బ్యాకప్ చేయవచ్చు. అయితే త్వరలో వాట్సాప్ దానిని 15 జీబీకి మాత్రమే పరిమితం చేయనుంది. అంటే మీ గూగుల్ అకౌంట్లో ఎంత స్పేస్ ఖాళీ  ఉంటుందో అంత డేటాను మాత్రమే బ్యాకప్ చేయగలరన్న మాట. ఇప్పటి వరకు వాట్సాప్ బ్యాకప్‌ను గూగుల్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించేది కాదు. కానీ ఇకపై పరిస్థితి అలా ఉండబోదు. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో అధికారికంగా అప్‌డేట్ చేసింది.


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!