ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగించే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) త్వరలో వారి NRE (నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) ఖాతాలు, అంతర్జాతీయ నంబర్‌ల మధ్య కూడా నగదు బదిలీ బదిలీ చేయగలుగుతారు.
UPI సంబంధిత దేశీయ కోడ్‌లతో పాటు 10 దేశాల మొబైల్ నంబర్‌ల నుండి లావాదేవీలను ప్రారంభించనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే దేశాల నుంచి త్వరలో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు.
రెగ్యులేటరీ సమస్యలు
అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను కలిగి ఉన్న నాన్-రెసిడెంట్ ఖాతాలు యూపీఐలో FEMA (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (AML), CFT (ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం) నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయడానికి అనుమతి లభించనుంది. సింగపూర్ నుంచి నంబర్లతో లావాదేవీలు త్వరలో ప్రారంభించడానికి యూపీఐ, సింగపూర్ పేనౌ భాగస్వామ్యం ఏర్పరచుకోనున్నాయి.
"ఇటువంటి ఏకీకరణలో అతిపెద్ద సమస్య చట్టపరమైన అడ్డంకులు, డేటా షేరింగ్ నిబంధనలు." అని సింగపూర్ మానిటరీ అథారిటీ చీఫ్ ఫిన్‌టెక్ ఆఫీసర్ సోప్నేందు మొహంతి అన్నారు. 2023 ఏప్రిల్ 30వ తేదీలోపు ఎన్‌పీసీఐ సభ్యులందరూ ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు.
స్మార్ట్ ఫోన్ల ద్వారా డబ్బును బదిలీ చేయడానికి UPI అత్యంత అనుకూలమైన మార్గాలలో ఒకటి. 2022లో UPI నెట్‌వర్క్ లావాదేవీలు 90 శాతం పెరిగాయి. ఇక నగదు విషయంతో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే లావాదేవీల విలువలో 76 శాతం పెరిగింది. యూపీఐ ద్వారా చెల్లింపు లావాదేవీలు నెలవారీగా 7.7 శాతం పెరిగి డిసెంబర్‌లో గరిష్టంగా ₹12.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి.