Jio New Year Offer: 2022 సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు కొత్త సంవత్సరం గురించి ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు టెలికమ్యూనికేషన్ సంస్థ రిలయన్స్ జియో కొత్త సంవత్సరానికి రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 2023 సంవత్సరానికి గానూ జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్'ని ప్రారంభించింది. రూ.2023 ధర కలిగిన ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటాను అందిస్తుంది. ఈ డేటాకు హై స్పీడ్ 5జీ సపోర్ట్ ఉంటుందని గుర్తుంచుకోండి. కొత్త సంవత్సరంలో కంపెనీ ఎలాంటి ఆఫర్లను తీసుకొచ్చిందో తెలుసుకోండి.
రూ.2,023 ప్లాన్ లాభాలు
జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2023 ప్లాన్'లో, కస్టమర్‌లు 252 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్‌తో మీరు రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. దీంతో పాటు వినియోగదారులు జియో యాప్‌ల ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. జియో వినియోగదారులు జియో టీవీ, సినిమాలు, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌ని ఉపయోగించగలరు.
కొత్త సంవత్సరం కోసం కంపెనీ కస్టమర్ల కోసం మరికొన్ని ప్లాన్‌లను కూడా తీసుకువచ్చింది. కొత్త ప్లాన్స్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఏదైనా థర్డ్ పార్టీ మొబైల్ రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లవచ్చు లేదా మీరు జియో అధికారిక యాప్‌ని సందర్శించడం ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
న్యూ ఇయర్ ఆఫర్ కింద కంపెనీ రూ.2,999 ప్లాన్‌పై వినియోగదారులకు 75 GB అదనపు డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీ ప్రయోజనాన్ని అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్‌లు 365 రోజుల పాటు ప్రతిరోజూ 2.5 GB డేటాను పొందుతారు. దీంతో పాటు అపరిమిత కాల్స్, 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనం ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. రీచార్జ్ ప్లాన్‌తో పాటు, వినియోగదారులు జియో యాప్‌ల సభ్యత్వాన్ని కూడా పొందుతారు.