Cyber Security Tips: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో చెల్లింపులు చేయడానికి మనమందరం యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నాం. యూపీఐ యాప్‌లతో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మనం ఒకరి ఖాతాకు మరొకరు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈ విధంగా ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ రోజుల్లో క్విషింగ్ స్కామ్ మార్కెట్‌లో చాలా మంది వ్యక్తులతో జరుగుతోంది. దీనిలో మోసగాళ్ళు నకిలీ క్యూఆర్ ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. క్విషింగ్ స్కామ్‌లో, నకిలీ క్యూఆర్ కోడ్‌ల ద్వారా వ్యక్తుల వ్యక్తిగత వివరాలు దొంగిలిస్తారు.


స్కామర్లు ఈ క్యూఆర్ కోడ్‌లను ఎక్కడైనా ఉంచవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా వెబ్‌సైట్, యాడ్స్ మొదలైనవాటిపై క్లిక్ చేస్తే, అది మిమ్మల్ని నేరుగా మరొక వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ మీ వివరాలను అడుగుతుంది. తద్వారా మీరు వెబ్‌సైట్‌లో తర్వాతి పేజీలకు వెళ్లవచ్చు. వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తర్వాత స్కామర్లు దీని ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారు. దీని తర్వాత మీ ఫోన్‌కు మోసపూరిత కాల్‌లు, స్కామ్‌లకు సంబంధించిన మెసేజ్‌లు వంటివి వస్తూ ఉంటాయి.


అందువల్ల ఎల్లప్పుడూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఏదైనా క్యూఆర్ కోడ్ కనిపిస్తే దాన్ని చెక్ చేయకుండా స్కాన్, షేర్ చేయవద్దు. ఒకవేళ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే ఆ వెబ్‌సైట్ నుంచి బయటకు రండి. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు, ఈ విషయంపై పరిశోధన చేయండి.


ఫిషింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి


క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసే ముందు వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌ను చెక్ చేసి, దాని యూఆర్ఎల్ ఏంటో, అది మిమ్మల్ని ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తుందో చూడండి. సైట్ సురక్షితంగా లేకుంటే అందులో ఎలాంటి వివరాలను నమోదు చేయవద్దు.


ఇటువంటి మోసాలను నివారించడానికి మీరు బిల్ట్ ఇన్ సెక్యూరిటీ ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటువంటి యాప్‌లు మీకు హానికరమైన, తప్పుడు కోడ్‌ల గురించి ముందుగానే సమాచారాన్ని అందిస్తాయి. అంటే ఇది మిమ్మల్ని మోసాల బారిన పడకుండా రక్షించగలరని అర్థం.


మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లప్పుడూ అప్‌టుడేట్‌గా ఉంచుకోండి. వీలైతే యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలను ఎక్కడా వెల్లడించకుండా, మీ డిజిటల్ ఖాతాల పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు వీటిని కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండటం మంచిది. ప్రస్తుతం మనదేశంలో ఇంటర్నెట్ ఆధారిత స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి స్కామ్‌ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!