ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. కొన్ని వారాల కిందటే ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ను అందుబాటులోకి తేబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజాగా ఈ ఫీచర్ ను పరిచయం చేసింది. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు ప్రొఫైల్ బదిలీ గురించి ఇమెయిల్‌ల ద్వారా తెలియజేయడం ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం యూజర్ కు సంబంధించిన వ్యూయింగ్ హిస్టరీతో పాటు సిఫార్సులు, మైలిస్ట్, సేవ్ చేసిన గేమ్స్ సహా పలు అంశాలను ఇతర అకౌంట్స్ కు బదిలీ చేసే అవకాశం ఉంది.
ఏ అంశాలను బదిలీ చేసుకోవచ్చంటే?
"ప్రజలు ముందుగుసాగుతారు. కుటుంబాలు పెరుగుతాయి. సంబంధాలు ముగుస్తాయి. కానీ ఈ జీవిత మార్పులన్నిటికీ, మీ Netflix అనుభవం ఒకేలా ఉండాలి. ఈరోజు, మేము ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ అవకాశాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది మీ అకౌంట్ ను ఉపయోగించే వ్యక్తులను ప్రొఫైల్‌ను ట్రాన్స్ ఫర్ చేయడానికి అనుమతించే ఒక ఫీచర్. వ్యక్తిగతీకరించిన సిఫార్సులను అలాగే ఉంచడం, వ్యూయింగ్ హిస్టరీ, మై లిస్ట్, సేవ్ చేసిన గేమ్‌లు, ఇతర సెట్టింగ్‌లు ఇతరులను వినియోగించుకునే అవకాశం ఉంది” అని నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ప్రకటించినప్పుడు, వినియోగదారు ఖాతాలో ప్రొఫైల్ ట్రాన్స్ ఫర్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఇమెయిల్ ద్వారా తెలియజేయబడుతుందని నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే తెలిపింది.
పేమెంట్స్ విషయంలో ఆ అవకాశం లేదు
నెట్ ఫ్లిక్స్ వినియోగదారులు తమ ఖాతాలను బదిలీ చేయాలనుకునే వెబ్ లో, మీ ప్రొఫైల్ కు యాక్సెస్ ఉన్న అకౌంట్ కు సైన్ ఇన్ చేయడం ద్వారా మొదలు పెట్టవచ్చు. వినియోగదారులు వారి నెట్ ఫ్లిక్స్ అకౌంట్ పేజీని కూడా చూసే అవకాశం ఉంటుంది. లేదంటే వారి హోమ్‌పేజీలో డ్రాప్ డౌన్‌లో ఈ ఎంపికను చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే, Netflix ప్రొఫైల్ బదిలీలో భాగంగా చెల్లింపు సమాచారం కొత్త అకౌంట్ కు బదిలీ చేయబడదు. అలాగే, పిల్లల ప్రొఫైల్‌లు మరియు PIN- ప్రొటెక్టెడ్ ప్రొఫైల్‌లు కూడా బదిలీ చేయబడవు.
నవంబర్ 3 నుంచి 'బేసిక్ విత్ యాడ్స్' స్ట్రీమింగ్ ప్లాన్
నవంబర్ 3 నుంచి మరోవైపు వినియోగదారుల కోసం యాడ్ సపోర్ట్ టైర్‌ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన నెట్ ఫ్లిక్స్, నవంబర్ 3 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేబోతుంది. పలు దేశాలలో 'బేసిక్ విత్ యాడ్స్' స్ట్రీమింగ్ ప్లాన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. "ప్లాన్ ప్రకటనదారులకు ఒక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీని అందజేయబోతున్నాం. ఎలాంటి అవాంతరాలు లేని , హెచ్ డీ ప్రకటనల అనుభవంతో స్ట్రీమింగ్ ఉంటుంది. టీవీని ఎక్కువగా చూడని యువ వీక్షకులతో సహా విభిన్న ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంటుంది” అని నెట్ ఫ్లిక్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అయిన గ్రెగ్ పీటర్స్ వెల్లడించారు.
Read Also: ట్విట్టర్ నుంచి బయటకు వెళ్తూ, పరాగ్ అగర్వాల్ ఎంత డబ్బు తీసుకెళ్తారో తెలుసా?