MSI Claw Gaming PC: ఎంఎస్ఐ క్లా (MSI Claw) గేమింగ్ డివైస్ ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలో లాంచ్ అయింది. ఇది ఒక పీసీలా పని చేస్తుంది. దీన్ని చేత్తో పట్టుకుని ఆపరేట్ చేయవచ్చు. జనవరిలో జరిగిన సీఈఎస్ 2024లో దీన్ని మొదట ప్రదర్శించింది. స్టీమ్ డెక్, అసుస్ రోగ్ యాలీ, లెనోవో లీజియన్ గోలతో ఇది పోటీ పడనుంది. చేతుల్లో పట్టుకుని గేమింగ్ చేసే ఆప్షన్ ఉండటం దీని స్పెషాలిటీ. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌పై ఈ డివైస్ రన్ కానుంది. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ డివైస్ పని చేయనుంది.
ఎంఎస్ఐ క్లా ధర (MSI Claw Price)
ఈ డివైస్‌లో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్‌ను బట్టి దీని ధర మారుతూ ఉంటుంది. 699 డాలర్ల (సుమారు రూ.57,793) నుంచి వీటి ధర ప్రారంభం కానుంది. కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతానికి యూఎస్‌లో ఈ డివైస్ అందుబాటులో ఉంది. ఇటువంటి డివైస్‌లకు మనదేశంలో కూడా ఆదరణ పెరుగుతోంది. కాబట్టి త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఎంఎస్ఐ క్లా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (MSI Claw Specifications)
ఇందులో ఏడు అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్లపై ఈ డివైస్ పని చేయనుంది. విండోస్ 11 హోం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఎంఎస్ఐ క్లా పని చేయనుంది.
ఇందులో 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1 టీబీ వరకు ఎన్వీఎంఈ పీసీఈఐ జెన్4 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ అందించారు. అదనంగా మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఉంది. వైఫై 7, బ్లూటూత్ వీ5.4, థండర్‌బోల్ట్ 4, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ మైక్ కాంబో జాక్ అందించారు.
డ్యూయల్ స్పీకర్లు, ఆర్జీబీ ఏబీఎక్స్‌వై బటన్లు, థంబ్ స్టిక్స్, డీ-ప్యాడ్, ట్రిగ్గర్లు, హెచ్‌డీ హాప్టిక్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. కూలర్ బూస్ట్ హైపర్ ఫ్లో టెక్నాలజీ ద్వారా హీట్ మేనేజ్‌మెంట్ జరుగుతుంది. 6 సెల్, 53డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీని అందించారు. 65W యూఎస్‌బీ పీడీ 3.0 ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని మందం 21.2 సెంటీమీటర్లు కాగా, బరువు 675 గ్రాములుగా ఉంది.
మరోవైపు పోకో ఎక్స్6 నియో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై లాంచ్ ఆఫర్ కూడా పోకో అందిస్తుంది. పోకో ఎక్స్6 నియో 5జీలో 6.67 అంగుళాల డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం.
Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!
Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?