మోటొరోలా ప్రస్తుతం ‘ఫ్రంటియర్ 22’ అనే కోడ్‌నేమ్‌తో కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించిన రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో కనిపించాయి. వీటి ప్రకారం ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ప్రధాన కెమెరాగా 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం జులైలో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. అదే జరిగితే 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 125W వైర్డ్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఈ ఫోన్ 5సపోర్ట్ చేయనుంది.
హోల్ పంచ్ కటౌట్‌లో సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. వెనకవైపు మూడు కెమెరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. జర్మనీకి చెందిన ఒక ప్రముఖ వెబ్‌సైట్‌లో దీని వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
మోటొరోలా ఫ్రంటియర్ 22 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉండనుంది. హెచ్‌డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ఎస్4875 అనే కోడ్ నేమ్ ఉన్న ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉండనున్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 60 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
వైఫై 6ఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, బ్లూటూత్ వీ5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించనున్నారు. స్టీరియో స్పీకర్లు, మూడు మైక్రోఫోన్లు ఇందులో ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించనున్నారు.