ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా, భారత మార్కెట్లో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. Motorola Edge 40 పేరు తాజాగా ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్లోకి 8GB RAM, 256 GB ఇన్ బిల్ట్ మెమరీతో విడుదల చేశారు. పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.29,999గా కంపెనీ ఫిక్స్ చేసింది. ఆన్ లైన్ స్టోరీ ఫ్లిప్ కార్ట్ ద్వారా యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నెల 30 నుంచి అమ్మకాలు షురూ కానున్నాయి. అంతేకాదు, నిర్ణయించిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 2000 వరకు ఇన్ స్టంట్ రాయితీ లభించే అవకాశం ఉంది.
Motorola Edge 40 స్పెసిఫికేషన్స్
Motorola Edge 40 స్మార్ట్ ఫోన్ పలు రకాల రంగుల్లో అందుబాటులో ఉంది. ఎక్లిప్స్ బ్లాక్, లూనర్ బ్లూ, నెబుల్లా గ్రీన్ కలర్ ఆప్షన్లలో వినియోగదారుల ముందుకు వచ్చింది. గ్రీన్, బ్లాక్ వేరియంట్ ఫోన్లు వెగాన్ లెదర్ బ్యాక్ ఫినిష్, బ్లూ వేరియంట్ మ్యాట్లె అక్రియిలిక్ రేర్ పానెల్ ను కలిగి ఉంటున్నాయి. వస్తున్నది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే, 6.55 ఇంచుల Full HD+ పోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 144 Hz రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో అందుబాటులోకి వస్తుంది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8020 Soc 5జీ చిప్ తో వస్తుంది. రెండేండ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించనున్నట్లు మోటరోలా వెల్లడించింది.
సూపర్ డూపర్ కెమెరా సెటప్
ఇక ఈ స్మార్ట్ ఫోన్ డ్యుయెల్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 50 MP ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఫర్ మాక్రో లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 32MP పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ 4400 Mah కెపాసిటీ గల బ్యాటరీ విత్ 68 WT టర్బో పవర్ వైర్డ్ చార్జింగ్, 15 WT వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. వైఫై6, బ్లూ టూత్ వీ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ సెన్సర్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంటుంది.
Read Also: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!