Moto G64 5G Launch Date: మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఏప్రిల్ 16వ తేదీన లాంచ్ కానుంది. అధికారిక లాంచ్‌కు ముందు మోటొరోలా దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. రెండు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లిస్ట్ అయింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


మోటొరోలా ఇండియా వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు లిస్ట్ అయ్యాయి. ఐస్ లైలాక్, మింట్ గ్రీన్, పెరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుందని ఈ లిస్టింగ్‌లో పేర్కొన్నారు. 


ఆండ్రాయిడ్ 14 ఆధారిత మై యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ64 5జీ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ సహా మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది.






Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


ఈ లిస్టింగ్ ప్రకారం మోటో జీ64 5జీ స్మార్ట్ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడవచ్చు. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా మోటోరోలా ఈ ఫోన్‌లో అందించనుంది. ఎఫ్ఎం రేడియో, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, బైదు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు మోటో జీ64 5జీలో ఉన్నాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీని సపోర్ట్ చేసే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో అందించారు.


యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, సార్ సెన్సార్, సెన్సార్ హబ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను మోటో జీ64 5జీ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు