Moto G04 Launched: మోటో జీ04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 8 జీబీ పెంచుకోవచ్చు. అంటే ఏకంగా  ఫోన్ వెనకవైపు సింగిల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ముందువైపు కూడా సెల్ఫీ కెమెరాను అందించారు.


మోటో జీ04 ధర (Moto G04 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.6,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా నిర్ణయించారు. జియో రూ.399 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.2,000 విలువైన క్యాష్ బ్యాక్ వోచర్లు, రూ.2,500 విలువైన పార్ట్‌నర్ కూపన్లు లభించనున్నాయి. దీనికి సంబంధించిన సేల్ ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో జరగనుంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.


మోటో జీ04 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Moto G04 Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. పంచ్ హోల్‌ను సరిగ్గా మధ్యలో అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్ ద్వారా ఫోన్ రన్ అవుతుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఈ ఫోన్ 102 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్, 22 గంటల టాక్ టైమ్‌ను అందించనుందని సమాచారం. డాల్బీ అట్మాస్ ఫీచర్‌ను సపోర్ట్‌ చేసే స్పీకర్లు కూడా అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉండనుంది.


మరోవైపు వివో వీ30 ప్రో స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఈ ఫోన్ రాబోయే కొన్ని వారాల్లో మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. వివో వీ30 స్మార్ట్ ఫోన్ కొన్ని మార్కెట్లలో ఇప్పటికే లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో 3డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే అందించనున్నారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని వివో తెలిపింది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?