Moto G Play 2024 Price: మోటో జీ ప్లే (2024) స్మార్ట్ ఫోన్ నార్త్ అమెరికా మార్కెట్లలో లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన మోటో జీ ప్లే (2023)కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి కొన్ని అప్‌గ్రేడ్స్ కూడా అందించారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ల ద్వారా ఫొటోలు దిగవచ్చు.


మోటో జీ ప్లే (2024) ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర 149.99 డాలర్లుగా (సుమారు రూ.12,500) నిర్ణయించారు. అమెరికాలో దీనికి సంబంధించిన సేల్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


మోటో జీ ప్లే (2024) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా స్క్రీన్ ప్రొటెక్షన్ లభించనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్ మోటో జీ ప్లే (2024)లో అందించారు. దీన్ని వర్చువల్‌గా 6 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఫోన్ వెనకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 46 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఈ ఫోన్ అందించనుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను మోటో జీ ప్లే (2024) సపోర్ట్ చేయనుంది. ఐపీ52 రేటింగ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 4జీ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 185 గ్రాములుగా ఉంది.


మరోవైపు మోటో జీ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న హోల్ పంచ్ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.  6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించారు. మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, పీర్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!