ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ తన లేటెస్ట్ 13 సిరీస్‌ను డిసెంబర్ 11వ తేదీన లాంచ్ చేయనుంది. మొదట ఇవి సొంత దేశం అయిన చైనాలో లాంచ్ కానున్నాయి. దీంతోపాటు ఎంఐయూఐ 14ను కూడా కంపెనీ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. షావోమీ 13 సిరీస్‌తోనే ఇవి మొదట అందుబాటులోకి రానున్నాయి. షావోమీ బడ్స్ 4, షావోమీ వాచ్ ఎస్2 కూడా ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యాయి.


క్వాల్‌కాం టాప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2తో వచ్చిన కొన్ని మొదటి ఫోన్లలో ఇది కూడా ఒకటి. వివో ఇప్పటికే ఎక్స్90 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను అదే ప్రాసెసర్‌తో లాంచ్ చేసింది. నిజానికి షావోమీ 13 సిరీస్ ఫోన్లు డిసెంబర్ 1వ తేదీనే లాంచ్ కావాల్సింది. అయితే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ జియాంగ్ జెమిన్ మరణంతో ఈ లాంచ్ 11వ తేదీకి వాయిదా పడింది.


షావోమీ 13 ఫెయిర్లీ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ విభాగంలో లాంచ్ కానుంది. బ్లూ లెదర్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. వీటికి సంబంధించిన ఫీచర్లు, రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. జర్మన్ దిగ్గజ కెమెరా బ్రాండ్ లెయికాతో షావోమీ ఒప్పందం కుదుర్చుకుంది. వీటి డిజైన్ యాపిల్ ఐఫోన్ తరహాలో ఉంది.


ఇక దీనికి పోటీనిచ్చే వివో ఎక్స్90 ప్రో ప్లస్ విషయానికి వస్తే... ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్‌లో 6.78 అంగుళాల 2కే ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వివో ఎక్స్90 ప్రో ప్లస్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ను అందించారు. దీని వెడల్పు ఒక అంగుళం ఉండనుందన్న మాట. దీంతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌‌ను వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. 5జీని కూడా వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. దీని బరువు 221 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?