Whatsapp IOS Beta Threaded Replies:వాట్సాప్ లేనిదే ఇప్పుడు ఏ పని ముందుకు సాగడం లేదు. ప్రతి అవసరానికి ఫోన్ ఎంత అవసరమో అందులో వాట్సాపప్ మెసేజ్ కూడా అంతే అవసరం. అందుకే దీన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేసేందుకు మెటా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో కొత్త పీచర్‌తో వస్తోంది. ప్రస్తుతానికి ఐవోస్‌లో బీటా వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అప్‌డేట్ కానుంది.
ప్రస్తుతం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలంటే ఆ మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేసి ‘‘Reply’’ సెలెక్ట్ చేయాల్సి వస్తోంది. దీంతో పాత మెసేజ్‌తోపాటు కొత్త మెసేజ్ కనిపిస్తోంది. కానీ, ఒకే చాట్‌లో, ముఖ్యంగా గ్రూప్ చాట్‌లలో ఒకే అంశంపై ఎక్కువ చాటింగ్ జరిగితే మాత్రం ముఖ్యమైన విషయమేదో తెలియకుండా పోతుంది. ఏ మెసేజ్‌కు రిప్లై ఏదో అర్థంకాదు. ఒకే అంశానికి సంబంధించిన మెసేజ్‌లు వెతకడం కూడా కష్టమే. దీనికి పరిష్కారంగానే థ్రెడ్డెడ్ రిప్లైస్ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
"థ్రెడ్డెడ్ రిప్లైస్" ప్రారంభం?గ్రూప్ చాట్స్‌లో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన అన్ని రిప్లైలు ఒకే చోట గ్రూప్‌గా చేసుకోవచ్చు. దీని వల్ల యూజర్‌కు ఏ అంశంపై ఏం చాటింగ్ జరిగిందో స్పష్టత వస్తుంది.
కొత్త ఫీచర్ ప్రకారం పాత మెసేజ్‌లకు వచ్చిన రిప్లైలు ఒకే థ్రెడ్‌లో కనిపిస్తాయి. దీని వల్ల చర్చను ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది.
ఆఫీస్ గ్రూప్ చాట్స్, ప్రాజెక్ట్ డిస్కషన్స్‌లో, ప్రతి అంశానికి సంబంధించిన చర్చను ట్రాక్ చేయడం ఈజీ అవుుతంది.
కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది?ప్రస్తుతానికి ఈ ఫీచర్ WhatsApp iOS బీటా వర్షన్ 25.19.10.80లో టెస్టింగ్‌లో ఉంది. ‘‘థ్రెడ్డెడ్ రిప్లైస్’’ ఫీచర్‌ను TestFlight ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది iPhone యూజర్లకు మాత్రమే వాడుకోవాడనికి ఇచ్చారు.
ప్రతి మెసేజ్‌కి ప్రత్యేక థ్రెడ్: ఒక మెసేజ్‌కు వచ్చిన అన్ని రిప్లైలు, సమయంతో సహా ఒకే చోట లిస్టుగా కనిపిస్తాయి.
ఇండికేటర్: మెసేజ్‌కు రిప్లైలు ఉన్నాయంటే ప్రత్యేక గుర్తు కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే, ఆ సందేశానికి సంబంధించిన అన్ని రిప్లైలు ఓ లిస్టుగా మీకు మొబైల్‌పై కనిపిస్తాయి.
సులభమైన నావిగేషన్: యూజర్ ఏదైనా రిప్లైను వెంటనే చదవొచ్చు, అదే థ్రెడ్‌లో కొత్తగా రిప్లై ఇవ్వొచ్చు కూడా.
టైమ్‌స్టాంప్: ప్రతి రిప్లైకి టైమ్‌స్టాంప్ ఉంటుంది. చర్చ ఎప్పుడు, ఎలా సాగిందో తెలుసుకోవచ్చు.
ఇతర ప్లాట్‌ఫామ్స్‌తో పోలిస్తేX (Twitter), LinkedIn వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే థ్రెడ్డెడ్ రిప్లైలు ఉన్నాయి. ఆలస్యంగా WhatsAppలో ఈ ఫీచర్ పరిచయం చేస్తోంది. యూజర్ అనుభవం మరింత సులభతరం అయ్యేందుకు దీన్ని తీసుకొస్తోంది.
WhatsApp ప్రత్యేకత ఏంటీ?వ్యక్తిగత, ప్రైవేట్ చాట్స్‌లో కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో, గంటల తరబడి జరిగే చర్చల్లో సందేశాలు మిస్ కాకుండా ఉంటాయి. టీమ్ డిస్కషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రతీ అంశాన్ని స్పష్టంగా ఫాలో కావచ్చు.
పర్సనల్ చాట్స్‌లో కూడా ఉపయోగకరం: కుటుంబ సభ్యులు, మిత్రులతో జరిగిన చర్చల్లో ముఖ్యమైన విషయాలు మిస్ కాకుండా ఉంటాయి. నెలల తరబడి జరిగిన చర్చల్లో కూడా, ఒకే సందేశానికి వచ్చిన అన్ని రిప్లైలు ఒకే చోట కనిపిస్తాయి.
బీటా టెస్ట్ విజయవంతమైతే, త్వరలోనే పబ్లిక్ బీటా, ఆపై Android యూజర్లకూ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. WhatsApp డెస్క్‌టాప్, వెబ్ వర్షన్‌లలో కూడా థ్రెడ్డెడ్ రిప్లైలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు WhatsApp బిజినెస్ యూజర్ల కోసం AI ఆధారిత చాట్‌బోట్స్, కాలింగ్, వాయిస్ చాట్ వంటి కొత్త ఫీచర్లపై కూడా మెటా వర్క్ చేస్తోంది.