వివో వై77  5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. వై-సిరీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇదే. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. గతేడాది లాంచ్ అయిన వివో వై76 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.


వివో వై77 5జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.23,600) నిర్ణయించారు. బ్లూ, పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ త్వరలో మలేషియా, మనదేశంలో కూడా లాంచ్ కానుంది.


వివో వై77 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌లను వివో వై77 5జీలో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. 


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!