వివో మనదేశంలో వీ25 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు వివో వీ25, వివో వీ25 ప్రోల ధరలు కూడా బయటకు వచ్చాయి.


వివో వీ25 కెమెరా వివరాలు
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇక సెకండరీ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. వివో వీ25 ప్రో 66W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. వివో వీ23 ప్రోలో 44W ఫాస్ట్ చార్జింగ్ అందించగా, తర్వాతి వెర్షన్ అయిన వివో వీ25 ప్రోలో మరింత పెంచడం విశేషం. 


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వివో వీ25 ప్రో రానుందని తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే... ఈ ఫోన్ రూ.40 వేల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వివో వీ25 ప్రోలో ప్రత్యేకమైన కలర్ చేంజింగ్ టెక్నాలజీ ఉండనుంది. ఫ్లోరైట్ ఏజీ గ్లాస్‌ను ఫోన్ వెనకవైపు అందించనున్నారు. ఇదే టెక్నాలజీని వివో వీ23 ప్రోలో కూడా అందించారు. అంటే వివో వీ25 ప్రో బ్యాక్ ప్యానెల్ సూర్యకాంతిలో రంగులు మారుస్తుందన్న మాట.


దీంతోపాటు వివో వీ25 ప్రో 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది.


ఇటీవలే బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన వివో
వివో ఇటీవలే టీ1ఎక్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో వివో టీ1ఎక్స్ కొనుగోలు చేయవచ్చు.


6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే‌ను ఈ ఫోన్‌లో అందించారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 90.6 శాతంగానూ, ఎన్టీఎస్సీ కలర్ గాముట్ 96 శాతంగానూ ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై వివో టీ1ఎక్స్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!