ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో స్మార్ట్ 6 హెచ్‌డీ అనే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. మూడు కలర్ వేరియంట్లలో ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ కొనుగోలు చేయవచ్చు.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,799 ధరకే లాంచ్ అయింది. ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.


ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 31 గంటల పాటు కాల్ మాట్లాడవచ్చు.


ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


గత కొన్ని రోజుల క్రితం ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 ప్రోను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 480 నిట్స్‌గా అందుబాటులో ఉంది. యూనిసోక్ టీ616 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.


ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో ఇటీవలే కొత్త స్మార్ట్ టీవీ కూడా లాంచ్ చేసింది. ఇన్‌ఫీనిక్స్ 32వై1 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. పేరుకు తగ్గట్లు ఈ టీవీలో 32 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు అందించనున్నారు.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!