Diwali 2025: దీపావళి వేడుకను చేసుకునేందుకు యావత్ దేశం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పండగ సందడి మొదలైపోయింది. ఇంటిని అందంగా అలంకరించుకుంటున్నారు. రకరకాల టపాసులు, పూలతో మార్కెట్‌లు కళకళలాడుతున్నాయి. కాంతులు, సంతోషాలతో నిండిన ఈ పండుగ జ్ఞాపకాలను ప్రజలు గుర్తుంచుకోవాలనుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలు కొత్త బట్టలు ధరించి, కాంతులతో అలంకరించిన తమ ఇళ్లలో ఫోటోలు తీసుకుంటారు. ఈ దీపావళికి మీరు వృత్తిపరమైన ఫోటోగ్రాఫర్‌లాంటి ఫోటోలు తీయడానికి సహాయపడే కొన్ని చిట్కాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. 

Continues below advertisement

ముందుగా లెన్స్‌ను శుభ్రం చేయండి

దీపావళి అయినా, మరే ఇతర సందర్భమైనా, ఫొటోలు తీసే ముందు కెమెరా లెన్స్‌ను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. లెన్స్‌పై వేలిముద్రలు లేదా దుమ్ము కారణంగా కొన్నిసార్లు మంచి ఫోటోలు రావు. కాబట్టి మీరు కెమెరాతో ఫోటోలు తీస్తున్నా లేదా మొబైల్‌తో తీస్తున్నా, ఫోటోగ్రఫీ ప్రారంభించే ముందు లెన్స్‌ను మైక్రోఫైబర్ గుడ్డతో శుభ్రం చేసుకోండి.

లైటింగ్‌పై శ్రద్ధ వహించండి

ఫొటోగ్రఫీలో లైటింగ్‌పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సరైన లైటింగ్, కోణం నుంచి ఫోటో తీస్తే, అద్భుతమైన చిత్రం వస్తుంది. దీపావళి సందర్భంగా అంతటా లైట్లు వెలిగిస్తారు. కాబట్టి ఫొటోలు తీసేటప్పుడు, సబ్జెక్ట్‌పై పూర్తి వెలుగు ఉండేలా చూసుకోండి, కానీ సబ్జెక్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి ఎక్కువ కాంతి కెమెరాలోకి రాకుండా చూసుకోండి.

Continues below advertisement

సరైన ఫ్రేమ్‌ను ఎంచుకోండి

ఫొటోలు తీసేటప్పుడు చేసేటప్పుడు ఫ్రేమ్‌ను సెట్ చేయడం కూడా ముఖ్యం. దీపావళి సందర్భంగా రంగురంగుల లైట్లు, దీపాలను మీ ఫ్రేమ్‌లో ఉంచి మంచి ఫొటోలు క్లిక్ చేయవచ్చు. కాబట్టి ఫొటో తీసే ముందు, మనసులో ఒక ఫ్రేమ్‌ను సెట్ చేసుకోండి. దాని ప్రకారం సబ్జెక్ట్‌ను ఉంచండి. 

వివిధ మోడ్‌లలో ఫొటోలు తీయండి

దీపావళి సందర్భంగా ఏదైనా ఫొటో తీసేటప్పుడు, వివిధ మోడ్‌లను ఉపయోగించండి. మోడ్‌ల సహాయంతో, మీరు చాలా అద్భుతమైన ఫొటోలను క్లిక్ చేయవచ్చు. రాత్రి ఫొటోగ్రఫీ కోసం నైట్ మోడ్ ఉపయోగించడం మంచిది. వృత్తిపరమైన కెమెరా వంటి ప్రభావాల కోసం పోర్ట్రెయిట్ లేదా ప్రో మోడ్‌తో ఫొటోలు తీయండి.