Google Diwali Offer: Googleలో స్టోరేజీ ఎంత అవసరమో చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువైంది. ఫొటోలు, వీడియోలు, యాప్‌లతో స్టోరేజీ ఫుల్ అయిపోతోంది. టీపీ మెసేజ్‌లు కూడా రావడం లేదు. వినియోగదారులు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని  గూగుల్‌ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఫోటోలు, వీడియోలను స్టోర్ చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఆఫర్ వినియోగించుకుంటే కచ్చితంగా దీపావళి ఫొటోలు, వీడియోల స్టోరేజీకి సంబంధించిన చింత అవసరం లేదు. నచ్చినన్ని ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.  

Continues below advertisement

స్టోరేజీ సమస్యలను పరిష్కరించేందుకు దీపావళికి ముందు Google ఒక ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది, దీనిలో చాలా తక్కువ ధరకు చాలా స్టోరేజీని పెంచుకునే వీలు కల్పిస్తోంది. కాబట్టి మీకు Google డ్రైవ్ స్టోరేజీ అవసరమైతే, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.  

ఇది Google ప్రత్యేక ఆఫర్

ఈ ప్రత్యేక ఆఫర్ కింద, Google ప్రీమియం 2TB ప్లాన్‌ను కేవలం 11 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. Google తన స్టోరేజీ ప్లాన్‌లను దీపావళి ఆఫర్ కింద ఈ ప్లాన్ ప్రకటించింది. మీకు తక్కువ స్టోరేజ్‌ అవసరమైతే, మీరు Google లైట్ 30GB ప్లాన్‌ను తీసుకోవచ్చు. దీని కోసం మీరు మొదటి మూడు నెలల పాటు కేవలం 11 రూపాయలు చెల్లించాలి. మూడు నెలల తర్వాత వినియోగదారుల నుంచి నెలకు 59 రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా, 100GB బేసిక్ ప్లాన్‌ను కూడా మొదటి మూడు నెలల పాటు 11 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. తరువాత నెలకు 130 రూపాయలు చెల్లించాలి.

Continues below advertisement

ప్రామాణిక ప్లాన్ కోసం కూడా ఈ ఆఫర్

Google తన 200GB ప్రామాణిక ప్లాన్‌ను కూడా ఆఫర్ కింద మొదటి మూడు నెలల పాటు 11 రూపాయలకు అందిస్తోంది. మూడు నెలల తర్వాత, ఈ ప్లాన్ కోసం నెలకు 210 రూపాయలు చెల్లించాలి. కంపెనీ 2TB నిల్వ ప్లాన్‌ను కూడా కేవలం 11 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మూడు నెలల తర్వాత, ఈ ప్లాన్ ధర నెలకు 650 రూపాయలు అవుతుంది. 

వార్షిక ప్లాన్‌పై తగ్గింపు లభిస్తుంది

Google తన అన్ని ప్లాన్‌ల వార్షిక సభ్యత్వాలపై కూడా తగ్గింపును ప్రకటించింది. 30GB వార్షిక ప్లాన్‌ను కేవలం 479 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా, 100GB ప్లాన్‌ను 1560 రూపాయలకు బదులుగా 1000 రూపాయలకు, 200GB ప్లాన్‌ను 2520 రూపాయలకు బదులుగా 1600 రూపాయలకు పొందవచ్చు. 2TB ప్రీమియం ప్లాన్ వార్షిక ధర ఇప్పుడు 7800 రూపాయల నుంచి 4900 రూపాయలకు తగ్గించారు.