టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. దీని ధర, స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైవోఎస్ యూఐ, మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఈ ఫోన్ ధరను ఆన్‌లైన్‌లో లీక్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉండనున్నాయి. వాల్యూమ్ రాకర్లు, పవర్ బటన్ ఫోన్‌కు కుడివైపున ఉండనున్నాయి.
టెక్నో పోవా నియో 5జీ ధర (అంచనా)
టెక్నో పోవా నియో 5జీ ధర రూ.17 వేల నుంచి రూ.19 వేల మధ్యలో ఉండనుంది. సాఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా నియో 5జీ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ కానుంది.
టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని వార్తలు వచ్చాయి. ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండనుంది. 6.9 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా టెక్నో పోవా నియో 5జీలో అందించనున్నారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ యూఐ ఆఫరేటింగ్ సిస్టంపై మొబైల్ పనిచేయనుంది.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
టెక్నో పాప్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరను బంగ్లాదేశ్‌లో 10,490 టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,900) నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది. దీని భారతీయ వేరియంట్ ధర రూ.9 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై టెక్నో పాప్ 6 ప్రో రన్ అవ్వనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?