టెక్నో పోవా 4 స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం లాంచ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 5 జీబీ పెంచుకోవచ్చు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13, రెడ్‌మీ 10, నోకియా జీ11 స్మార్ట్ ఫోన్లతో టెక్నో పోవా 4 పోటీ పడనుంది.
టెక్నో పోవా 4 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. డిసెంబర్ 13వ తేదీ నుంచి దీని సేల్ అమెజాన్‌లో ప్రారంభం కానుంది. క్రిస్టొలైట్ బ్లూ, యూరనోలిత్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
టెక్నో పోవా 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్, 10W రివర్స్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డీటీఎస్ ఆడియో టెక్నాలజీ ఉన్న డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 12.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టెన్స్ ఫీచర్ ఇందులో ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?