Smartphones under Rs 15000: అద్భుతమైన ఫీచర్స్‌, బ్యాటరీలతో రూ. 15000లోపు ఉన్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

Smartphones under Rs 15000: 15,000 రూపాయల లోపు బడ్జెట్‌లో మోటోరోలా, ఓప్పో వంటి బ్రాండ్లు అద్భుతమైన ఫోన్లు అందిస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్నాయి.

Continues below advertisement

Smartphones under Rs 15000: స్మార్ట్‌ మొబైల్ వచ్చిన తర్వాత తరచూ ఫోన్లు మార్చే వాళ్లు ఎక్కువమంది కనిపిస్తున్నారు. మంచి ఫీచర్స్‌తో ఉండే లో బడ్జెట్‌ మొబైల్స్ కొని కొన్ని రోజులు వాడేసి మళ్లీ కొత్తగా వచ్చే లేటెస్ట్ లో బడ్జెట్‌ ఫోన్‌లు కొంటున్నారు. ఈ కోవలోకి మీరు వచ్చినట్టు అయితే ఈ స్మార్ట్‌ ఫోన్ లిస్టు మీ కోసమే. 

Continues below advertisement

తక్కువ బడ్జెట్‌తో మంచిస్మార్ట్‌ ఫోన్‌ కోసం చూస్తున్న వాళ్ల కోసం మోటోరోలా, ఓప్పోతో సహా అనేక కంపెనీలు మంచి ఫోన్‌లు అందిస్తున్నాయి. మీ బడ్జెట్‌లోనే అనేక స్మార్ట్ మొబైల్స్ లభిస్తున్నాయి. 15,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్ల జాబితాను మీ కోసం తీసుకొచ్చాం. వాటిపై ఓలుక్ వేసి మీకు నచ్చిన ఫోన్‌ను మీ సొంతం చేసుకోండి 

15 వేల రూపాయల కంటే తక్కువ ధరకు లభించే మొబైల్స్‌ లిస్ట్ ఇవ్వడమే కాదు వాటిలో సరికొత్త ఫీచర్స్‌ వివరాలు కూడా మీకు అందిస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ ఏంటీ మిమ్మల్ని ఆకట్టుకునే ఫీచర్లు ఏం ఉన్నాయో వివరిస్తాం. 

Vivo T4x 5G
వీవో సంస్థకు చెందిన Vivo T4x 5G ఫోన్‌లో 6.72 అంగుళాల Full HD+ 120Hz డిస్ప్లే ఉంది. వెనుక 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ముందువైపు 8MP కెమెరా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 300 5G ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 6500 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి దీని 8GB+128GB వేరియంట్‌ను డిస్కౌంట్ తర్వాత 14,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G
OPPO K12x 5G ఫోన్ 6.67 అంగుళాల HD LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది 6GB+128GB , 8GB+256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని స్టోరేజ్‌ను 1TB వరకు పెంచవచ్చు. కెమెరా విషయానికొస్తే, దీని బ్యాక్‌సైడ్‌ 32MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఇందులో 8MP కెమెరా ఉంది. OPPO K12x 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 5100 mAh బ్యాటరీ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది 12,999 రూపాయలకు అందుబాటులో ఉంది.

Motorola g45 5G
మోటోరోలా కూడా 15000 రూపాయల లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తుంది. Motorola g45 5Gలో 6.5 అంగుళాల HD+ 120Hz IPS LCD డిస్ప్లే ఉంది. దీని 4GB, 8GB RAM వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌లో 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 16MP లెన్స్ ఉంది. Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ తర్వాత దీని ధర 11,999 రూపాయలు.

Continues below advertisement
Sponsored Links by Taboola