Smartphone Buying Tips: ఈ రోజుల్లో మొబైల్ కేవలం విలాస వస్తువు మాత్రమే కాదు. మన జీవితంలో ఒక భాగమైపోయింది. మొదట్లో కాల్ చేయడానికి, మెసేజింగ్ చేయడానికి మాత్రమే మొబైల్ అవసరం. కానీ నేడు మొబైల్ ద్వారా చాలా పనులు క్షణకాలంలో జరిగిపోతున్నాయి. మీరు ప్రస్తుతం కొత్త స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే కచ్చితంగా ఈ ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోండి.
డిస్‌ప్లే
ఏ ఫోన్‌లో అయినా డిస్‌ప్లే చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు లేటెస్ట్ డిస్‌ప్లే ఉన్న ఫోన్‌ను ఎంచుకోండి. తద్వారా మీరు ఫోన్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మెరుగైన అనుభవాన్ని పొందవచ్చు. AMOLED, OLED డిస్‌ప్లేలు మీకు మంచి క్వాలిటీని అందిస్తాయి.
స్టోరేజ్
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఫోన్ వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తున్నారు. అందుకే స్టోరేజీకి ఎక్కువ మెమరీ అవసరం. ఫోన్ స్టోరేజ్ తక్కువగా ఉంటే, మొబైల్ ప్రాసెసింగ్ వేగం తగ్గుతుంది. అందుకే మీ ఫోన్‌లో 64 జీబీ నుంచి 128 జీబీ వరకు మెమరీ ఉండాలి.
ర్యామ్
స్మార్ట్ ఫోన్ ప్రాసెసింగ్‌లో ర్యామ్ చాలా కీలకం. మీ ఫోన్‌లో 6 జీబీ నుంచి 8 జీబీ వరకు RAM ఉంటే మీ ఫోన్ హ్యాంగ్ అవ్వదు. అంతకంటే తక్కువ ఉంటే ప్రాసెస్ పరంగా మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది లేదా నెమ్మదిస్తుంది. అందుకే ఫోన్ తీసుకునేటప్పుడు ర్యామ్‌ను దృష్టిలో పెట్టుకోండి.
కెమెరా
ఇప్పుడు ఫోన్ అంటే మంచి కెమెరా కూడా. చాలా మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు జీవితంలోని ప్రతి క్షణాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. అందువల్ల మీ ఫోన్‌లో మంచి కెమెరా సెటప్ లేకపోతే. కాబట్టి మీరు మంచి నాణ్యమైన చిత్రాలను ఆస్వాదించలేరు.
సెక్యూరిటీ ఫీచర్లు
స్మార్ట్‌ఫోన్‌లో పైన పేర్కొన్న ఫీచర్లు ఎంత ముఖ్యమైనవో, సెక్యూరిటీ ఫీచర్ అంత ముఖ్యమైనది. తద్వారా మీ మొబైల్‌లో మీ ప్రైవసీ అలాగే ఉంటుంది. సెక్యూరిటీ ఫీచర్లు సరిగ్గా లేనప్పుడు, ఎవరైనా మీ స్మార్ట్‌ఫోన్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీ వ్యక్తిగత డేటాతో పాటు మీ బ్యాంక్ ఖాతాను దొంగిలించవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?