Science Behind Black and White Chargers : మీరు గమనించే ఉంటారు.. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు ఛార్జర్‌లు నలుపు లేదా తెలుపు రంగులోనే ఉంటాయి. పరికరం ఏ రంగులో ఉన్నా.. దాని ఛార్జర్ మాత్రం నలుపు లేదా తెలుపు రంగులోనే ఉంటుంది. ఎందుకలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కంపెనీలు ఇతర ఉపకరణాల మాదిరిగానే ఛార్జర్‌లను కూడా రంగురంగుల్లో తయారు చేయవచ్చు కదా.. మరి అలా ఎందుకు చేయవు? దీని వెనుక రీజన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

భద్రత (Safety)

కంపెనీలు తమ ఛార్జర్‌లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు ఫైర్ సేఫ్టీ, షార్ట్-సర్క్యూట్ టెస్ట్‌లతో సహా అనేక రకాల భద్రతా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. న్యూట్రల్ రంగులతో కూడిన ప్లాస్టిక్ ఫార్ములా సాధారణంగా నమ్మకమైనదిగా పరిగణిస్తారు. ఇది ముందే సర్టిఫై చేయబడింది. కాబట్టి దీనివల్ల భద్రతా ఆమోదం త్వరగా లభిస్తుంది.

సౌలభ్యం (Convenience)

కంపెనీలకు నలుపు, తెలుపు ఛార్జర్‌లను తయారు చేయడం సులభం. పైగా చౌక కూడా. ఒకవేళ వారు పరికరాల రంగులకు అనుగుణంగా ఛార్జర్‌లను తయారు చేయడం ప్రారంభిస్తే.. వారికి వేర్వేరు రంగులు అవసరమవుతాయి. దీనివల్ల ఖర్చు పెరుగుతుంది. కాబట్టి నలుపు,  తెలుపు ఛార్జర్‌లను తయారు చేయడం కంపెనీలకు సులభంతో కూడుకున్నది. రెండవది, వినియోగదారులకు కూడా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ వారి ఛార్జర్ పాడైపోతే.. పరికరంతో సరిపోయే రంగు ఛార్జర్‌ను కనుగొనడం వారికి కష్టమవుతుంది. ఏదైనా చోట ఒక రంగు కొరత కారణంగా వారికి ఛార్జర్ దొరకడంలో ఆలస్యం కూడా కావచ్చు. అందువల్ల కంపెనీలతో పాటు వినియోగదారులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది.

Continues below advertisement

సైన్స్ (Science)

భద్రత, సౌలభ్యంతో పాటు.. ఛార్జర్ నలుపు లేదా తెలుపు రంగులో ఉండటానికి సైన్స్ కూడా ఓ కారణం. వాస్తవానికి, నలుపు లేదా తెలుపు రంగుల వల్ల ఛార్జర్ నుంచి వెలువడే వేడిని సులభంగా వెదజల్లవచ్చు (dissipate). దీనివల్ల ఛార్జింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే వేడి లోపల చిక్కుకోదు. ఛార్జర్ ఓవర్‌హీట్ అవ్వకుండా కాపాడుతుంది. ఈ విధంగా రంగు ఎంపిక వెనుక సైన్స్ కూడా ఒక పెద్ద అంశం.