గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బిగ్ బ్యాటరీలపై బాగా దృష్టి సారిస్తున్నాయి. 2025లో అనేక కంపెనీలు 6000, 7,000mAh కంటే ఎక్కువ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌లతో తమ ఫోన్‌లను విడుదల చేశాయి. సంవత్సరం చివరి నాటికి Honor కంపెనీ 10,000mAh బ్యాటరీతో ఫోన్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు పెద్ద బ్యాటరీల ఫోన్లు మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. ఎందుకంటే Samsung 20,000mAh బ్యాటరీని పరీక్షిస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో చైనీస్ కంపెనీలదే ఆధిపత్యం కనిపించింది. కానీ ఇప్పుడు Samsung అందరినీ అధిగమించడానికి సిద్ధమైంది. 

Continues below advertisement

అందరినీ ఆశ్చర్యపరచనున్న Samsung

సాధారణంగా Apple కంపెనీ లాగే Samsung కూడా తమ ఫోన్‌లలో ఇతర కంపెనీలంత పెద్ద బ్యాటరీలను ఇవ్వడానికి ఇష్టపడదు. కానీ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు బిగ్ బ్యాటరీపై శాంసంగ్ సైతం ఫోకస్ చేస్తోంది. కంపెనీ ఫ్లాగ్‌షిప్ డివైజ్ Galaxy S25 Ultraలో కూడా 5,000mAh బ్యాటరీ ఇచ్చింది. ఇప్పుడు ఒక టిప్‌స్టర్ ప్రకారం, Samsung డ్యూయల్ సెల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని పరీక్షిస్తోంది. ఆ బ్యాటరీ కెపాసిటీ ఏకంగా 20,000mAh కావడంతో హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో రెండు వేర్వేరు సైజుల సెల్‌లను ఉపయోగించారని, అవి కలిసి 20,000mAh కెపాసిటీని అందిస్తాయని తెలుస్తోంది. ఈ బ్యాటరీ మొత్తం 27 గంటల స్క్రీన్ ఆన్-టైమ్‌ను ఇచ్చిందని, వార్షికంగా 960 ఛార్జ్ సైకిళ్లను తట్టుకుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. అంటే యూజర్లు పగలు రాత్రి వీడియోలు చూసినా ఈ బ్యాటరీ కంప్లీట్ అవ్వదు. 

Continues below advertisement

అంచనాలకు తగ్గట్టుగా లేని ఫలితాలు

అయితే, టెస్టింగ్‌లో అన్నీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. బ్యాటరీ ఉబ్బిపోయిందని సమాచారం. దీని స్వల్పకాలిక పనితీరులో ఎటువంటి సమస్య రాలేదు. కానీ దీర్ఘకాలిక పనితీరు కోసం ఇంకా పని చేయాల్సి ఉంది. మరో నివేదిక ప్రకారం, టెస్టింగ్ సమయంలో బ్యాటరీ ఉబ్బిన తర్వాత దాని పరిమాణం బాగా పెరిగిందని, ఇది స్మార్ట్‌ఫోన్‌లో వాడకానికి ప్రమాదకరమని తెలుస్తోంది.  అయితే, Samsung కంపెనీ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.